India vs Bangladesh 2nd Test Highlights: తొలి రోజు కేవలం 35 ఓవర్లు ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ తరువాత రెండు రోజులు ఒక్క బంతి కూడా పడకుండానే వర్షార్పణమైంది. ఇక మిగిలింది రెండు రోజులే. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ రిజల్ట్ వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ టీమిండియా రెండో టెస్టులో దుమ్ములేపింది. బలమైన బౌలింగ్ అటాక్‌.. బ్యాటింగ్‌లో పవర్‌ హిట్టింగ్‌తో ఏడు వికెట్ల తేడాతో సునాయసంగా విజయం సాధించింది. 26/2 వద్ద చివరి రోజును తిరిగి ప్రారంభించిన బంగ్లాదేశ్.. 146 పరుగులకు ఆలౌట్ అయింది. 95 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత్ తరఫున రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తలో మూడు వికెట్లు తీశారు. ఛేదనలో జైస్వాల్ 51 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లో విరాట్ కోహ్లి, రిషబ్ పంత్ నాటౌట్‌గా నిలిచి జట్టుకు గెలుపు అందించారు. బంగ్లాదేశ్‌ తరఫున మెహిదీ హసన్‌ మిరాజ్‌ రెండు వికెట్లు తీయగా.. తైజుల్‌ ఇస్లామ్‌ ఒక వికెట్ తీశాడు. ఈ గెలుపుతో రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Jaggi Vasudev: నీ కూతురుకు పెళ్లి.. ఇతర మహిళలకు సన్యాసమా..?.. జగ్గీ వాసుదేవ్‌పై సీరియస్ అయిన హైకోర్టు..స్టోరీ ఏంటంటే..?  


మొదట టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ 233 పరుగులకు ఆలౌట్ అయింది. మోమినల్ (107) సెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం టీమిండియా దూకుడుగా ఆడుతూ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 285 పరుగులకు డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ (72), కేఎల్ రాహుల్ (68) అర్ధ సెంచరీలతో అలరించగా.. విరాట్ కోహ్లీ (47), శుభ్‌మన్ గిల్ (39) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 52 పరుగుల ఆధిక్యం లభించింది. 


రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్.. నాలుగో రోజు రెండు వికెట్లు కోల్పోయింది. చివరి రోజు డ్రా కోసం ప్రయత్నించిన బంగ్లాను భారత బౌలర్లు ఆటాడుకున్నారు. ఓపెనర్ షాదామ్ ఇస్లామ్ (50) హాఫ్‌ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. సీనియర్ బ్యాట్స్‌మెన్ ముష్పీకర్ రహీమ్ (37) కాసేపు ప్రతిఘటించాడు. చివరకు 146 పరుగులకు బంగ్లాదేశ్‌ ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా 17.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి.. 98 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. రోహిత్ శర్మ (8), శుభ్‌మన్ గిల్ (6), యశస్వి జైస్వాల్ (51) వికెట్లను కోల్పోగా.. విరాట్ కోహ్లీ (29 నాటౌట్), రిషబ్ పంత్ (4 నాటౌట్) భారత్‌కు విజయాన్ని అందించారు. యశస్వి జైస్వాల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా.. రవీచంద్రన్ అశ్విన్‌కు మ్యాన్ ఆఫ్‌ ద సిరీస్ అవార్డు దక్కింది.


Also Read: Prediabetes Reversal tips: ప్రీ డయాబెటిస్ అంటే ఏంటి, రివర్సల్ చేయగలమా లేదా


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.