India Vs Bangladesh Dream11 Team Tips and Pitch Report: ఆసియా కప్‌లో వరుస విజయాలతో ఫైనల్లో దూసుకెళ్లిన టీమిండియా.. నేడు (శుక్రవారం) సూపర్‌-4లో భాగంగా చివరి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. బంగ్లా ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. భారత్ ఫైనల్‌కు చేరుకోవడంతో నామమాత్రంగా సాగనుంది. కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి మ్యాచ్‌ ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా రిజర్వ్ బెంచ్‌ను పరీక్షించే అవకాశం కనిపిస్తోంది. గత రెండో మ్యాచ్‌లకు దూరమైన శ్రేయాస్‌ అయ్యర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్, హార్థిక్ పాండ్యా, బుమ్రాలకు కూడా విశ్రాంతి ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరు తుది జట్టులో ఉంటారు..? బంగ్లాదేశ్‌ ప్లేయింగ్ 11 ఉంటుంది..? పిచ్ రిపోర్ట్ ఏమిటి..? డ్రీమ్11 టీమ్‌లో ఎవరిని ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పిచ్ రిపోర్ట్ ఇలా..


కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో  పరుగుల వరద పారుతోంది. ఈ పిచ్ బ్యాటింగ్‌కు సహకరిస్తున్నా.. స్పిన్నర్లు ప్రభావంతంగా బౌలింగ్ చేస్తున్నారు. భారత్-శ్రీలంక జట్లు ఇదే స్టేడియంలో తలపడగా.. స్పిన్నర్లకే వికెట్లు ఎక్కువగా దక్కాయి. భారత్ వికెట్లన్నింటిని స్పిన్నర్లే పడగొట్టడం విశేషం. ఈ నేపథ్యంలో పిచ్‌పై మరోసారి స్పిన్నర్లు డేంజర్‌గా మారే అవకాశం ఉంది. మ్యాచ్ చివరలో పేసర్లకు సహకారం లభిస్తుంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. 


స్ట్రీమింగ్ వివరాలు ఇలా..


వేదిక: ఆర్.ప్రేమదాస స్టేడియం, శ్రీలంక
సమయం: మధ్యాహ్నం 3 గంటలకు నుంచి ప్రారంభం
స్ట్రీమింగ్ వివరాలు: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్, డిస్నీ +హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ మొబైల్ వర్షన్‌లో ఫ్రీగా చూడొచ్చు.


తుది జట్లు ఇలా.. (అంచనా)


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషాన్/శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా/తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా/మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్


బంగ్లాదేశ్: మహ్మద్ నయీమ్, మెహిదీ హసన్, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్ (వికెట్ కీపర్), షమీమ్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్


డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇలా..


వికెట్ కీపర్లు: కేఎల్ రాహుల్, ముష్ఫికర్ రహీమ్


బ్యాట్స్‌మెన్లు: రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్, లిట్టన్ దాస్


ఆల్‌రౌండర్లు: హార్దిక్ పాండ్యా, షకీబుల్ హసన్ (వైస్ కెప్టెన్)


బౌలర్లు: మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, తస్కిన్ అహ్మద్


Also Read: Numerology Number Predictions Today: ఈ నంబరు ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే లక్కే లక్కు.. మీ దశ తిరిగినట్లే..!  


Also Read: Health Tips in Telugu: పాలలో ఖర్జూరం మరగబెట్టి తింటే అద్భుత ప్రయోజనాలు.. ఒక్కసారి తీసుకుంటే..!     



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook