KL Rahul: రాహుల్ రాణించాల్సిన సమయం ఆసన్నమైంది.. లేదంటే..: రవిశాస్త్రి
IND vs BAN: Ravi Shastri reacts on KL Rahul Poor Form in T20 World Cup 2022. టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
Ravi Shastri reacts on KL Rahul Poor Form in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న పొట్టి టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో డబుల్ డిజిట్ అందుకోలేదు. పాకిస్థాన్, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికాపై వరుసగా 4, 9, 9 రన్స్ చేశాడు. దాంతో రాహుల్‌పై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. వైస్ కెప్టెన్సీ హోదాలో ఉన్నా.. ఫామ్‌లో లేకుంటే జట్టు నుంచి ఉద్వాసన తప్పదు అని భారత మాజీలు ఇప్పటికే హెచ్చరించారు. తాజాగా రాహుల్ ఫామ్‌పై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు.
కేఎల్ రాహుల్ పరుగులు చేయాల్సిన సమయం ఆసన్నమైందని రవిశాస్త్రి అన్నారు. రాహుల్ రన్స్ చేయకుంటే.. మిడిల్ ఆర్డర్‌పై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఐసీసీ ది బిగ్ టైం ప్రివ్యూలో రవిశాస్త్రి మాట్లాడుతూ... 'భారత్ టాప్ ఆర్డర్ ఆట తీరులో కొంత నిలకడ రావాల్సి ఉంది. ముఖ్యంగా కేఎల్ రాహుల్ పరుగులు సాధిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. రాహుల్ రన్స్ చేస్తే.. మిడల్ ఆర్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది' అని చెప్పారు.
కేఎల్ రాహుల్ ఫామ్‌తో ఇబ్బంది పడుతుండగా.. సూర్యకుమార్ యాదవ్ పరుగుల వరద పారిస్తున్నాడు. మూడు గేమ్‌లలో 67.00 సగటు, 178.66 స్ట్రైక్ రేట్‌తో 134 పరుగులు చేశాడు. ఇందులో రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి. సూర్యకుమార్ యాదవ్ ఫామ్‌పై రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'సూర్య టీ20 ప్రపంచకప్ 2022లో వెలిగిపోతున్నాడు. 10 ఏళ్ల క్రితం ఎవరూ ఊహించని షాట్లను కూడా ఆడుతున్నాడు. సూర్య అద్భుతమైన ఆటగాడడు' అని ప్రశంసించారు. ఇక బంగ్లాదేశ్‌తో బుధవారం జరిగే మ్యాచ్‌లోనూ రోహిత్ శర్మతో కలిసి రాహులే ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తాడని కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పష్టం చేశారు.
Also Read: T20 World Cup 2022 Final: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఇంటికే.. టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆడేది ఆ రెండు జట్లే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook