Ravindra Jadeja Rare feet: టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా రాజ్‌కోట్‌ టెస్టులో సెంచరీతో చెలరేగాడు. మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను రోహిత్‌ శర్మతో కలిసి ఆదుకున్నాడు జడ్డూ. వీరిద్దరూ నాలుగో వికెట్ కు 204 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 110 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచ్ లో శతకం సాధించడం ద్వారా జడ్డూ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టుల్లో 3వేల పరుగులు, 250కిపైగా వికెట్లు తీసిన అతికొద్దిమంది ఆటగాళ్ల జాబితాలో జడేజా చోటు సంపాదించాడు. టీమిండియా తరపున ఈ ఫీట్ సాధించిన మూడో ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. గతంలో కపిల్, అశ్విన్ మాత్రమే ఈ ఘనత సాధించారు. డేనియల్‌ వెటోరి (4,531 రన్స్‌, 362 వికెట్లు), షేన్‌ వార్న్‌ (3,154 రన్స్‌, 708 వికెట్లు), అశ్విన్‌(3,271 పరుగులు, 499 వికెట్లు) తర్వాత ఈ ఫీట్ సాధించిన నాలుగో స్పిన్నర్ గా జడేజా ఉన్నాడు. 


–> షేన్‌ వార్న్‌ – 3154 రన్స్‌, 708 వికెట్లు
–> స్టువర్ట్‌ బ్రాడ్‌ – 3,662 రన్స్‌, 604 వికెట్లు
–> అశ్విన్‌ – 3271 రన్స్‌, 499 వికెట్లు
–> కపిల్‌ దేవ్‌ -5248 రన్స్‌, 434 వికెట్లు
–> రిచర్డ్‌ హ్యాడ్లీ – 3124 రన్స్‌, 431 వికెట్లు
–> షాన్‌ పొలాక్‌ – 3781 రన్స్‌, 421 వికెట్లు
–> ఇయాన్‌ బోథమ్‌ – 5200 రన్స్‌, 383 వికెట్లు
–>  ఇమ్రాన్‌ ఖాన్‌ – 3807 రన్స్‌, 362 వికెట్లు
–> డేనియల్‌ వెటోరీ – 4531 రన్స్‌, 362 వికెట్లు
–> చమిందా వాస్‌ – 3089 రన్స్‌, 355 వికెట్లు
–> జాక్వస్‌ కలిస్‌ – 13289 రన్స్‌, 292 వికెట్లు
–> రవీంద్ర జడేజా – 3003 రన్స్‌, 280 వికెట్లు


Also Read: IND vs ENG 3rd Test: రోహిత్‌, జడేజా సెంచరీలు..ఆరంగ్రేటంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్‌.. తొలి రోజు టీమిండియాదే..


Also Read: IND vs ENG: సెంచరీతో చెలరేగిన రోహిత్.. దాదా రికార్డును బ్రేక్ చేసిన హిట్ మ్యాన్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook