Ind vs Eng 03rd Test Live Updates: ఓవర్ నైట్ స్కోరు 326/5 తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్వల్ప వ్యవధిలోనే కులదీప్ యాదవ్, జడేజా వికెట్లును కోల్పోయింది. కులదీప్(4) ను అండర్సన్.. జడేజాను జో రూట్ ఔట్ చేశారు. నిన్నటి స్కోరుకు కేవలం రెండు రన్స్ మాత్రమే జోడించి జడేజా(112) ఔటయ్యాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అనంతరం క్రీజులోకి వచ్చిన అశ్విన్, ధ్రువ్ జురెల్ నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించారు. వీరిద్దరూ ఇంగ్లీష్ బౌలర్లకు వికెట్ ఇవ్వకుండా క్రీజులో పాతుకుపోయారు. అశ్విన్, ధ్రువ్ లంచ్ బ్రేక్ వరకు వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. లంచ్ సమయానికి టీమిండియా 113 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి  388 పరుగులు చేసింది. ప్రస్తుతం ధ్రువ్ 31 పరుగులతోనూ, అశ్విన్ 25 పరుగులతోనూ ఆడుతున్నాడు. 


రాజ్ కోట్ టెస్టులో తొలి రోజు టీమిండియా అదరగొట్టింది. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయినా అద్భుతంగా పోరాడి పటిష్ట స్థితికి చేరుకుంది. భారత్ కెప్టెన్ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజాలు సెంచరీలతో చెలరేగారు. తొలి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్‌ ఖాన్‌ హాఫ్ సెంచరీతో ఇరగదీశాడు. కేవలం 66 బంతుల్లోనే సిక్సర్, 9 ఫోర్లుతో 62 పరుగులు చేశాడు. మెుదటి రోజు ఇంగ్లండ్‌ బౌలర్లలో వుడ్‌ మూడు వికెట్లు తీశాడు. 


Also Read: Ravindra Jadeja Rare Feat: రాజ్‌కోట్‌ టెస్టులో చరిత్ర సృష్టించిన జడ్డూ.. దిగ్గజాల సరసన చోటు..


Also Read: IND vs ENG 3rd Test: రోహిత్‌, జడేజా సెంచరీలు..ఆరంగ్రేటంలోనే అదరగొట్టిన సర్ఫరాజ్‌.. తొలి రోజు టీమిండియాదే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter