Aakash Chopra picks India Playing 11 vs England: ఇంగ్లండ్‌‌పై టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న టీమిండియా.. వన్డే సిరీస్‌కు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఢీకొట్టనుంది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత కాలమానం ప్రకారం సాయత్రం 5.30 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఇంగ్లండ్, భారత జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్న నేపథ్యంలో రసవత్తర పోరు ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తొలి వన్డే మ్యాచ్‌కు భారత మాజీ క్రికెటర్‌, కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తన జట్టును ప్రకటించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆకాశ్‌ చోప్రా తన యూట్యూబ్‌ చానెల్‌లో మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ లేకుంటే జట్టు ఎంపిక సునాయాసంగా ఉంటుంది. రోహిత్‌ శర్మతో కలిసి శిఖర్‌ ధావన్‌ ఓపెనింగ్‌ చేస్తాడు. లెఫ్ట్‌, రైట్‌ ఓపెనింగ్‌ కాంబినేషన్‌ బాగుంటుంది. గాయం కారణంగా కేఎల్‌ రాహుల్‌ జట్టులో లేడు కాబట్టి ఓపెనింగ్ విషయంలో ఎలాంటి తల నొప్పులు ఉండవు' అని అన్నాడు. ఫామ్‌లో లేని కోహ్లీ.. గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. విరాట్ గాయం తీవ్రత ఎంతో ఇంకా తెలియలేదు. 


'శ్రేయస్‌ అయ్యర్‌ను మూడో స్థానంలో బరిలోకి దింపాలి. నాలుగో స్థానంలో సూర్యకుమార్‌ యాదవ్ ఎలాగూ ఆడతాడు. 5, 6, 7 స్థానాల్లో రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజాలను పంపాలి. పేస్ కోటాలో ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ షమీలకు తోడుగా అర్ష్‌దీప్‌ సింగ్‌ను ఎంచుకుంటా. అర్ష్‌దీప్‌ను ఈ మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేయించాలి. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ సిరాజ్‌ను కాకుండా అర్ష్‌దీప్‌ను తుది జట్టులోకి తీసుకోవాలి. స్పిన్ కోటాలో యజువేంద్ర చహల్‌ ఆడతాడు' అని ఆకాశ్‌ చోప్రా తన జట్టుని ప్రకటించాడు. 


ఆకాశ్‌ చోప్రా జట్టు:
రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్ పంత్‌, హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, ప్రసిద్‌ కృష్ణ, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, యజువేంద్ర చహల్‌.


Also Read: Sun Transit 2022: కర్కాటక రాశిలోకి సూర్యుడు.. నెల రోజుల పాటు ఈ రాశి వారిపై తీవ్ర ప్రభావం!   


Aslo Read: Rain Alert: మరింత బలపడిన అల్పపీడనం..తెలుగు రాష్ట్రాల్లో ఇక వానలే వానలు..!



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook