IND vs ENG 1st ODI Playing 11 out: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో మరికొద్ది సేపట్లో ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. గజ్జల్లో గాయం కారణంగా తొలి వన్డేకు విరాట్ కోహ్లీ దూరం కాగా.. శ్రేయస్‌ అయ్యర్‌ మూడో స్థానంలో బరిలోకి దిగుతాడు. యువ పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్‌కు నిరాశ తప్పలేదు. మరోవైపు ఇంగ్లండ్ కెప్టెన్ జొస్ బట్లర్ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్ జట్టులో కీలకమైన ఆటగాళ్లు జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ చేరడంతో పటిష్టంగా మారింది. దాంతో టీ20 సిరీస్‌లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. మరోవైపు భారత్ కూడా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఇంగ్లండ్, భారత్ జట్లు తొలి వన్డే మ్యాచ్‌లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ఇరు జట్లలో స్టార్ ప్లేయర్స్ ఉన్న నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. 


వన్డే క్రికెట్లో ముఖాముఖి పోరులో ఇంగ్లండ్‌పై భారత్‌దే పైచేయి. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 103 మ్యాచ్‌లు జరగగా.. భారత్‌ 55, ఇంగ్లండ్ 43 మ్యాచ్‌ల్లో గెలిచాయి. రెండు మ్యాచ్‌లు టైగా ముగిశాయి. ఇక మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. తొలి వన్డేకు వేదికైన ఓవల్‌ మైదానంలో భారత్‌, ఇంగ్లండ్ జట్లు 8 వన్డేలు ఆడాయి. ఇక్కడ భారత్ రెండు మ్యాచ్‌లే నెగ్గగా.. ఇంగ్లీష్ జట్టు 5 మ్యాచ్‌ల్లో నెగ్గింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. 



తుది జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్, ప్రసిద్ధ్ కృష్ణ. 
ఇంగ్లండ్: జేసన్ రాయ్, జానీ బెయిర్‌స్టో, జో రూట్, బెన్‌ స్టోక్స్, జోస్ బట్లర్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయీన్ అలీ, క్రెగ్ ఓవర్టన్, డేవిడ్ విల్లే, బ్రైడన్ కార్స్, రీస్ టాప్లే. 


Also Read: Shani Gochar 2022: మకర రాశిలోకి శని గ్రహం.. 6 నెలల పాటు ఈ 3 రాశుల వారికి కష్టాలే!


Also Read: Shani Remedies : మకర రాశిలో శని సంచారం.. శని పీడ నుంచి గట్టెక్కాలంటే ఈ నియమాలు పాటించాల్సిందే.. 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook