మాంచెస్టర్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన తొలి టీ20లో భార‌త్ విజ‌యం సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవ‌ర్లకుగాను ఎనిమిది వికెట్ల న‌ష్టానికి 159 ప‌రుగులు చేసింది. 160 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ 18.2 ఓవ‌ర్లకు కేవ‌లం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 163 ప‌రుగులు చేయ‌గ‌లిగింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై భార‌త్ విజ‌యం సాధించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్యాటింగ్, బౌలింగ్ అన్ని రంగాల్లో సమిష్టిగా రాణించడంతో భారత్ ఇంగ్లాండ్‌పై తొలి టీ20లో గెలిచింది. బ్యాటుతో కేఎల్ రాహుల్‌, బంతితో కుల్‌దీప్‌ చెలరేగడం భారత్‌కు విజయం వరించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టును కుల్దీప్ (5 వికెట్లు) బంతితో కట్టడి చేశాడు. దీంతో ఆ జట్టు 20 ఓవర్లకు 159/8 పరుగులు చేసింది. ఆ తరువాత భారత్ బ్యాటింగ్‌కు
దిగగా కేఎల్ రాహుల్ (101 నాటౌట్‌, 54 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరవిహారంతో 8 వికెట్ల తేడాతో భారత్ గెలిచింది. తొలి ఓవర్లోనే ధావన్‌ (4) ఔటైనా రాహుల్‌ తన షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. రోహిత్‌ శర్మ (32; 30 బంతుల్లో 3×4, 1×6), ఆ తర్వాత కోహ్లి (20 నాటౌట్‌) రాహుల్‌‌కు చక్కని సహకారం అందించారు. కాగా, ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భార‌త్ బ్యాట్స్‌మెన్ కే.ఎల్ రాహుల్ సెంచ‌రీ పూర్తి చేసి.. టీ20ల్లో తన రెండో శతకం సాధించాడు.


ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సంపాదించిగా.. జులై 6న రెండో టీ20 జరగనుంది.