BCCI announces Team India's squads for T20I and ODI series against England: ఐదవ టెస్టు మ్యాచ్‌ అనంతరం ఇంగ్లండ్‌, భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్, వన్డే సిరీస్ జరగనున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఇరు జట్ల మధ్య మూడు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి. జూలై 7న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఈ రెండు సిరీస్‌లకు 17 మంది సభ్యులతో కూడిన మూడు భారత జట్లను బీసీసీఐ గురువారం ప్రకటించింది. అయితే ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్ చేసిన 5వ టెస్టులో పాల్గొనున్న టీమిండియా సీనియర్‌ ఆటగాళ్లకు బీసీసీఐ సెలక్టర్లు తొలి టీ20కి విశ్రాంతిని ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇంగ్లండ్‌తో తొలి టీ20కి ఇటీవల ఐర్లాండ్‌తో తలపడిన భారత జట్టునే బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఐదవ టెస్టుకు దూరమైన స్టార్ ఓపెనర్ రోహిత్‌ శర్మ తొలి టీ20కు సారథ్యం వహించనున్నాడు. రాహుల్ త్రిపాఠికి ఐర్లాండ్ సిరీస్‌లో ఆడే అవకాశం రాకపోవడంతో.. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. త్రిపాఠికి తొలి టీ20లో మాత్రమే జట్టులో చోటు దక్కింది. జస్ప్రీత్ బుమ్రా ఇటీవలి దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆడలేదు. ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ల కోసం బుమ్రా చివరి రెండు టీ20లకు జట్టులో చోటు దక్కించుకున్నాడు.


రుతురాజ్ గైక్వాడ్ తొలి టీ20లో చోటు దక్కించుకున్నా.. రెండు, మూడు టీ20లకు మాత్రం అందుబాటులో ఉండడు. టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్ తొలి టీ20కి అందుబాటులో ఉండకున్నా.. రెండు, మూడో మ్యాచ్‌లకు తిరిగి జట్టులోకి వస్తాడు. అర్షదీప్ సింగ్ సైతం తొలి టీ20లో మాత్రమే ఆడతాడు. తొలిసారిగా భారత వన్డే జట్టుకు యువ పేసర్‌ ఆర్షదీప్‌ సింగ్‌ ఎంపికయ్యాడు. అదే విధంగా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌కు కూడా వన్డే జట్టులో చోటు దక్కింది. కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా ధావన్‌కు జట్టులో చోటు దక్కింది. జులై 7, 9, 10 తేదీల్లో టీ20లు జరగనుండగా.. 12, 14, 17 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. అందుకోసం భారత జట్టు సెలెక్షన్‌ కమిటీ వేర్వేరు జట్లను ప్రకటించింది.


తొలి టీ20 జట్టు: 
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సంజూ శాంసన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హూడా, రాహుల్‌ త్రిపాఠి, దినేశ్‌ కార్తీక్ (కీపర్‌)‌, హార్దిక్‌ పాండ్యా, వెంకటేశ్‌ అయ్యర్‌, యుజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.


రెండు, మూడు మ్యాచ్‌లకు జట్టు: 
రోహిత్‌ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, దీపక్‌ హూడా, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్ (కీపర్‌)‌, రిషబ్ పంత్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, రవి బిష్ణోయ్‌, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌, హర్షల్‌ పటేల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.


వన్డే జట్టు: 
రోహిత్‌ (కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్ పంత్‌ (కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్‌ ఠాకూర్‌, యుజ్వేంద్ర చహల్‌, అక్షర్‌ పటేల్‌, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌.


Also Read: IND vs ENG: రోహిత్ శర్మ ఔట్.. టీమిండియా కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రా! బీసీసీఐ అధికారిక ప్రకటన


Also Read: MS Dhoni Local Vaidya: నాటువైద్యం తీసుకుంటున్న ఎంఎస్ ధోనీ.. ఎంత చెల్లిస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.