IND vs ENG 2nd ODI, Babar Azam supports Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత 3 ఏళ్లుగా పరుగులు చేయడంలో సతమతమవుతున్నాడు. సునాయాసంగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసే కోహ్లీ.. ఇటీవల సింగల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. ఈ మూడేళ్లలో మూడు ఫార్మాట్లలో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. ఒక్క సెంచరీ బాధలేదు. తన స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోవడంతో అతడిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కోహ్లీని జట్టు నుంచి తప్పించాలని దిగ్గజాలు అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఇంగ్లండ్ గడ్డపై అయితే మరీ దారుణంగా విఫలమవుతున్నాడు. టెస్ట్, టీ20, వన్డేలలో ఒక్క గెలుపు ఇన్నింగ్స్ ఆడలేదు. ఇంగ్లండ్‌తో జ‌రిగ‌న రెండో వ‌న్డేలో కోహ్లీ 16 ర‌న్స్‌కే ఔట‌య్యాడు. ఎప్పటిలానే తన బలహీనతను బయటపెట్టుకొని పెవిలియన్‌కు చేరాడు. ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని ఆడబోయిన కోహ్లీ.. కీపర్‌ జోస్ బట్లర్‌ చేతికి చిక్కాడు. దీంతో కోహ్లీ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులలో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ మద్దతుగా నిలిచాడు. 'అతి త్వరలోనే ఇలాంటివి సమసిపోతాయి. ధైర్యంగా ఉండు' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


కెరీర్ ఆరంభం నుంచి పాకిస్తాన్ తరఫున నిలకడగా రాణిస్తున్న బాబర్‌ అజామ్‌.. విరాట్ కోహ్లీ రికార్డులను ఒక్కొక్కటిగా బద్దలుకొడుతూ వస్తున్నాడు. పరుగుల వరద పారిస్తూ కెప్టెన్ కూడా అయ్యాడు. కెప్టెన్ అయ్యాక కూడా మరింత బాధ్యతగా పరుగులు చేస్తున్నాడు. దాంతో బాబర్‌ను పాక్ అభిమానులు విరాట్‌తో పోలుస్తుంటారు. మాక్కూడా కోహ్లీ ఓ కోహ్లీ ఉన్నాడని సంతోషపడుతున్నారు. దిగ్గజాలు కూడా కోహ్లీ-బాబర్‌ను ప్రతిసారి పోల్చుతున్నారు. 



ప్రస్తుతం ‌ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ బాబర్ అజామ్‌ అగ్ర స్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే టీ20 ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. 1013 రోజుల పాటు కోహ్లీ టాప్‌ ప్లేస్‌తో కొనసాగగా.. దానిని బాబర్ బ్రేక్ చేశాడు. మరోవైపు కెప్టెన్‌గా కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో 1000కిపైగా పరుగులు చేయగా.. బాబర్‌ కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఫీట్‌ అందుకున్నాడు. 


Also Read: ఎన్నిసార్లు చెప్పాలంటూ.. ఓ రేంజ్‌లో ఫైర్ అయిన రోహిత్ శర్మ! అసలు విషయం ఏంటంటే


Also Read: Kiraak RP Jabardasth: కిరాక్ ఆర్పీ సినిమా అందుకే ఆగింది.. అసలు ఫ్రాడ్ బయటపెట్టిన ఏడుకొండలు


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.