IND vs ENG 2nd Test Day 2: భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (Yashsavi Jaiswal) ఇంగ్లండ్ పై జూలు విదిల్చాడు. వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో డబుల్  సెంచరీతో చెలరేగాడు. మిగతా బ్యాటర్లు చేతులెత్తేసిన వేళ.. అతడు అద్భుతంగా పోరాడి టీమిండియాకు భారీ స్కోరు అందించాడు. యశస్వికి టెస్టుల్లో ఇదే తొలి డబుల్‌ సెంచరీ కావడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముగిసిన భారత్ తొలి ఇన్నింగ్స్
179 పరుగుల వ్యక్తిగత స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన యశస్వి ఆది నుంచే దూకుడుగా ఆడాడు. ఈ క్రమంలో తొలి టెస్టు డబుల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 277 బంతుల్లోనే డబుల్‌ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం. 290 బంతుల్లో 209 పరుగుల చేసిన యశస్విని అండర్సన్ ఔట్ చేశాడు.  భారీ షాట్ కు యత్నించి అతడు పెవిలియన్ చేరాడు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లు ఉన్నాయి. అశ్విన్ 20 పరుగులు  మాత్రమే చేసి ఔటయ్యాడు. టెయిలెండర్లు పెద్దగా రాణించకపోవడంతో భారత్ తన  తొలి ఇన్నింగ్స్ లో 396 పరుగలకు ఆలౌటైంది. 


చరిత్ర సృష్టించిన యశస్వి
దీంతో అతి పిన్న వయస్సులోనే (22 ఏళ్ల 37 రోజులు) ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు. వినోద్‌ కాంబ్లి (21 ఏళ్ల 35 రోజులు, 21 ఏళ్ల 55 రోజులు), సునీల్ గావస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) ఇతడి కంటే ముందున్నారు.  అంతేకాకుండా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే ద్విశతకం చేసిన ఆరో టీమిండియా బ్యాటర్ గా జైస్వాల్ నిలిచాడు. అతడు 10వ ఇన్నింగ్స్‌లో డబుల్‌ సెంచరీ మార్కును అందుకోగా.. కరుణ్ నాయర్ (3), వినోద్ కాంబ్లి (4), గావస్కర్, మయాంక్‌ అగర్వాల్ (8), పుజారా (9) ముందున్నారు. 


Also Read: IND vs ENG 2nd Test Updates: ముగిసిన తొలి రోజు ఆట... డబుల్ సెంచరీకి చేరువలో యశస్వి..


Also Read: IND vs ENG 2nd Test: వీరూ స్టైల్లో సెంచరీ కొట్టిన యశస్వి జైస్వాల్.. భారీ స్కోర్ దిశ‌గా టీమిండియా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి