India Vs England 2nd Test Toss and Playing 11: ఇంగ్లాండ్ చేతిలో మొదటి టెస్టులో అనూహ్యంగా ఓడిపోయిన భారత్.. విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ACA-VDCA క్రికెట్ స్టేడియం వేదికగా రెండో టెస్టులో తలపడుతోంది. శుక్రవారం నుంచి మొదలుకానున్న ఈ టెస్ట్‌లు విజయం సాధించి.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయాలని టీమిండియా భావిస్తోంది. తొలి టెస్ట్‌లో 190 పరుగుల ఆధిక్యంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆధిపత్యం చెలాయించినా.. రెండో ఇన్సింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్ వైఫల్యంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఒల్లీ పోప్ (196) అద్బుతంగా పోరాటడంతో భారత్‌కు మ్యాచ్‌ దూరమైంది. రెండో టెస్టులో గెలవాలని పట్టుదలతో ఉన్న టీమిండియా.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి టెస్ట్‌లో అదరగొట్టిన కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఈ మ్యాచ్‌కు దూరమవ్వడం ఇబ్బందిగా మారింది. వీరిద్దరి ప్లేస్‌లో రజత్ పాటిదార్, కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి వచ్చారు. సిరాజ్ రెండో టెస్టుకు దూరమవ్వగా.. ముఖేష్‌ కుమార్‌ను ప్లేయింగ్ 11లోకి తీసుకున్నారు. ఇంగ్లాండ్ కూడా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. దాదాపు 4 ఏళ్ల తర్వాత విశాఖపట్నంలో టెస్టు మ్యాచ్‌ జరుగుతుండడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


తుది జట్లు ఇలా..


భారత్: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, శ్రీకర్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్.


ఇంగ్లాండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఆలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, షోయబ్ బషీర్, జేమ్స్ ఆండర్సన్