IND vs ENG 3rd Test: రాజ్‌కోట్‌లో యశస్వి తుఫాన్ ఇన్నింగ్స్.. టీమిండియాకు భారీ ఆధిక్యం..
Yashasvi Jaiswal: ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగడంతో భారత్ కు భారీ ఆధిక్యం లభించింది.
IND vs ENG 3rd Test live Updates: రాజ్‌కోట్‌లో టెస్టులో టీమిండియా పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేసి.. ఇంగ్లండ్ ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసింది భారత్. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్.. యశస్వీ జైస్వాల్ విధ్వంసంతో భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రోహిత్ సేన 51 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (104 : 133 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో చెలరేగి రిటైర్డ్ హార్ట్ కు వెనుదిరిగాడు. ఇతడికి శుభ్‌మన్ గిల్(65 నాటౌట్) చక్కటి సహకారం అందించాడు. దీంతో టీమిండియాకు 322 పరుగుల ఆధిక్యం లభించినట్లయింది.
యశస్వీ ఊచకోత..
వైజాగ్ టెస్టులో డబుల్ సెంచరీతో చెలరేగిన యశస్వీ రాజ్‌కోట్‌లోనూ రాజసాన్ని ప్రదర్శించాడు. రోహిత్ శర్మ(30) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా.. తను మాత్రం ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. టీ20 తరహాలో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 122 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో మూడో శతకాన్ని నమోదు చేశాడు. ఈ సిరీస్ లో ఇది రెండో సెంచరీ. లెజండరీ అండర్సన్ బౌలింగ్ లో అయితే వరుసగా 6, 4, 4 బాదాడు యశస్వి. హర్ట్లేను కూడా ఉతికారేశాడు. అతడి బౌలింగ్ రెండు సిక్సర్లు బాదాడు. దీంతో స్కోరు బోర్డు శరవేగంగా దూసుకెళ్లింది. ఇతడికి తోడు శుభ్ మన్ కూడా బ్యాట్ ఝలిపించాడు. ఆట కాసేపట్లో ముగుస్తుందనగా..యశస్వీ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రజత్ పాటిదార్ డకౌట్ అయ్యాడు. నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్(3 నాటౌట్)తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు గిల్.
Also Read: Ravichandran Ashwin: 500 వికెట్ల క్లబ్ లో అశ్విన్.. దిగ్గజాల సరసన చోటు..
ఓవర్‌నైట్ స్కోర్ 207/2తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లండ్ అనూహ్యంగా 319 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టు ఆటగాళ్లలో ఓపెనర్ బెన్ డకెట్(153), బెన్ స్టోక్స్(41), ఒలీ పోప్ (39) మాత్రమే రాణించారు. సిరాజ్ నాలుగు, కులదీప్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
Also Read: HCA Cricket Coach: క్రికెట్‌కే మాయని మచ్చ.. మద్యం తాగుతూ బస్సులో మహిళా క్రికెటర్లతో అసభ్య ప్రవర్తన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి