IND vs ENG 3rd Test Live Updates: రాజ్ కోట్ వేదికగా భారత్, ఇంగ్లండ్ ల మధ్య కీలకమైన మూడో టెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రేయస్ అయ్యర్ స్థానంలో స‌ర్ఫ‌రాజ్ ఖాన్ ఈ మ్యాచ్ ద్వారా టెస్టుల్లో ఆరంగ్రేటం చేయనున్నాడు. వరుసగా విఫలమవుతున్న తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్ ఫ్లేస్ లో ధ్రువ్ జురెల్ ను జట్టులోకి తీసుకున్నారు.  జడేజా, సిరాజ్ లు తిరిగి జట్టులోకి వచ్చారు. యంగ్ స్పిన్న‌ర్ బ‌షీర్ స్థానంలో మార్క్ వుడ్ ను టీమ్ లోకి తీసుకుంది ఇంగ్లీష్ టీమ్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిప్పులు చెరిగిన వుడ్
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. జట్టులోకి వచ్చిన ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ రోహిత్ సేనను బెంబేలేత్తించాడు. కీలకమైన రెండు వికెట్లు తీసి టీమిండియా వెన్నువిరిచాడు. గత టెస్టులో డబుల్ సెంచరీ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈసారి పది పరుగులకే ఔటయ్యాడు. శుభమన్ గిల్ డకౌట్ అయ్యాడు. వీరిద్దరి వికెట్లు వుడ్ తీశాడు. కాసేపటికే రజిత్ పటిదార్ ఐదు పరుగులకే పెవిలియన్ చేరాడు. మరోవైపు రోహిత్ శర్మ ఫోర్లుతో విరుచుకుపడుతున్నాడు. ప్రస్తుతం రోహిత్ హాఫ్ సెంచరీకి దగ్గరలో ఉన్నాడు. మరోవైపు క్రీజులోకి వచ్చిన జడేజా హిట్ మ్యాన్ కు చక్కటి సహకారమందిస్తున్నాడు. టీమిండియా 19 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. 


Also Read: ICC Rankings 2024: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన టీమిండియా ఆటగాళ్లు..!


భార‌త తుది జ‌ట్టు: య‌శ‌స్వీ జైస్వాల్, రోహిత్ శ‌ర్మ‌(కెప్టెన్), శుభ్‌మ‌న్ గిల్, ర‌జ‌త్ పాటిదార్, స‌ర్ఫ‌రాజ్ ఖాన్, ర‌వీంద్ర జ‌డేజా, ధ్రువ్ జురెల్(వికెట్ కీప‌ర్), అశ్విన్, కుల్దీప్ యాద‌వ్, జ‌స్ప్రీత్ బుమ్రా, సిరాజ్.
ఇంగ్లండ్ తుది జ‌ట్టు:  జాక్ క్రాలే, బెన్ డ‌కెట్, ఓలీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీప‌ర్), రెహాన్ అహ్మ‌ద్, టామ్ హ‌ర్ట్లే, మార్క్ వుడ్, జేమ్స్ అండ‌ర్స‌న్.


Also Read: Deepika Pilli: కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తోన్న దీపికా పిల్లి, లేటెస్ట్ పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter