IND vs ENG Day 4: పుజారా, రహానె సంయమనంతో బ్యాటింగ్..టీ విరామానికి 105/3
IND vs ENG: లార్డ్స్ టెస్టు నాలుగో రోజు టీ విరామానికి టీమ్ఇండియా 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. క్రీజులో అజింక్య రహానె (24), ఛెతేశ్వర్ పుజారా (29) ఉన్నారు.
IND vs ENG: లార్డ్స్ (Lords)వేదికగా ఇంగ్లాండ్ జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తడబడి..నిలబడింది. నాలుగోరోజు తొలి సెషన్ లో బ్యాటింగ్ కు దిగిన టీమిండియా టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(5), రోహిత్ (21)తో సహా కెప్టెన్ విరాట్ కోహ్లీ(20) సైతం విఫలమయ్యాడు.
భోజన విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 56 పరుగులే చేసిన భారత్(India) ను పూజారా(Pujara), రహానే(Rahane) ఆదుకున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ.. సిసలైన డిఫెన్స్ ఏంటో చూపించారు. అనవసరపు షాట్లకు పోకుండా సిసలైన టెస్టు బ్యాటింగ్‌ను బయటకు తీశారు. ఈ క్రమంలో ఈ జోడీ 179 బంతుల్లో కేవలం 50 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది.
KL Rahul test century: ఇండియా vs ఇంగ్లండ్ రెండో టెస్ట్‌లో కేఎల్ రాహుల్ సెంచరీ
ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్‌వుడ్(Markwood) రెండు, సామ్‌కరన్(Sam Karan) ఒక వికెట్ తీశారు. అంతకుముందు శనివారం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 391 పరుగులకు ఆలౌటైన సంగతి తెలిసిందే. ఆ జట్టు సారథి జో రూట్(180) భారీ శతకం సాధించాడు.
జో రూట్... క్లాసిక్ ఇన్నింగ్స్
ఈ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్(Joe Root) ఆడిన ఇన్నింగ్స్ అద్భుతమనే చెప్పాలి. మ్యాచ్‌లో మూడో రోజైన శనివారం ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 48తో బ్యాటింగ్ ప్రారంభించిన జో రూట్... తన జోరును ఎక్కడా తగ్గించలేదు. గతి తప్పిన బంతుల్ని తెలివిగా బౌండరీకి తరలిస్తూ పరుగులు రాబట్టి...టెస్టు కెరీర్‌లో 22వ శతకం సాధించాడు. ఇంగ్లాండ్ కెప్టెన్‌గా అతడికి 11వ టెస్టు సెంచరీ.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook