Virat Kohli is a better bowler than You, Netizens slams Avesh Khan: ఆసియా కప్ 2022లో భాగంగా హాంగ్‌కాంగ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్‌ అవేశ్ ఖాన్ దారుణంగా విఫలమయ్యాడు. తన కోటా నాలుగు ఓవర్లలో ఏకంగా 53 పరుగులు ఇచ్చి.. ఒకే ఒక్క వికెట్‌ పడగొట్టాడు. అతని ఎకానమీ 13.20గా ఉండడం విశేషం. పసికూన  హాంగ్‌కాంగ్‌ 152 పరుగులు చేయగలిగిందంటే అందుకు గల ప్రధాన కారణం అవేశ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హాంగ్‌కాంగ్‌ బ్యాటర్లు కూడా అవేశ్ బౌలింగ్‌ను తుక్కురేగొట్టారంటే.. ఎంత చెత్తగా బంతులు వేశాడో ఇట్టే అర్థమయిపోతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు ఓవర్లలో 32 రన్స్ ఇచ్చిన అవేశ్ ఖాన్.. చివరి ఓవర్లో 21 పరుగులు ఇచ్చాడు. హాంగ్‌కాంగ్‌ బ్యాటర్లు ఈ ఓవర్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదారు. అయితే హాంగ్‌కాంగ్‌ చేయాల్సిన పరుగులు ఎక్కువగా ఉండటంతో భారత్ విజయం ఖాయమైంది. లేదంటే పరిస్థితి మరోలా ఉండేది. ఇక ఇదే మ్యాచులో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఒక ఓవర్ బ్యాటింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దాంతో భారీగా పరుగులు ఇచ్చిన ఆవేశ్‌ ఖాన్‌పై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ నడుస్తోంది. కామెంట్స్, మీమ్స్‌తో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. 



'అవేశ్ ఖాన్.. నీ బౌలింగ్‌కు ఓ దండంరా అయ్యా' అని ఒకరు కామెంట్ చేయగా.. 'నీ కన్నా విరాట్ కోహ్లీ వంద పాళ్లు నయం' అని ఇంకొకరు కామెంట్ చేశారు. అవేశ్ ఖాన్ వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు, మొహ్మద్ మీతో పోల్చితే అవేశ్ ఖాన్ గొప్ప బౌలరా, జస్ప్రీత్ బుమ్రా లోటును అవేశ్ తీరుస్తాడని బీసీసీఐ భ్రమపడుతోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అవేష్‌ రెండు ఓవర్లు మాత్రమే వేశాడు. తదుపరి మ్యాచులో అతడికి అవకాశం దక్కడం అనుమానమే. 




Also Read: SKY Batting Secret: బహుశా నా బ్యాటింగ్ సీక్రెట్‌ అదేనేమో.. స్నేహితులతో కలిసి..!


Also Read: విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ‌.. టాప్‌లో ఎంఎస్ ధోనీ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook