India vs New Zealand 1st T20I  Dream11 Prediction: ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో తీవ్రంగా నిరాశపరిచిన భారత్.. న్యూజిలాండ్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడేందుకు సిద్దమైంది. మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కివీస్ పర్యటనకు వెళ్ళింది. నవంబర్ 18న ఈ టూర్ ఆరంభం అయి నవంబర్ 30న ముగుస్తుంది. టీ20 సిరీస్‌తో కివీస్ పర్యటన ఆరంభం అవుతుంది. శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య తొలి టీ20‌ జరగనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

న్యూజిలాండ్‌ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్ దూరంగా ఉన్నారు. రోహిత్ గైర్హాజరీలో టీ20ల్లో హార్దిక్ పాండ్యా, వన్డేల్లో శిఖర్ ధావన్ భారత జట్టును నడిపించనున్నారు. ఈ ఇద్దరికీ గతంలో భారత జట్టును నడిపిన అనుభవం ఉంది. భారత్, న్యూజిలాండ్‌ తొలి టీ20‌ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభం కానుంది. టాస్ ఉదయం 11.30 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ హాట్ స్టార్ సహా అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా లైవ్ స్ట్రీమింగ్ కానుంది. 


ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లు ఆడే అవకాశం ఉంది. మూడులో సంజూ శాంసన్, నాలుగులో సూర్యకుమార్ యాదవ్, ఐదులో రిషబ్ పంత్, ఆరులో హార్దిక్ పాండ్యా ఆడనున్నారు. దాంతో శ్రేయస్ అయ్యర్‌, దీపక్ హుడాకు బెంచికే పరిమితం అవ్వాల్సి ఉంటుంది. వాషింగ్టన్ సుందర్ ఆల్‌రౌండర్‌ కోటాలో ఆడతాడు. భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మొహ్మద్ సిరాజ్ లేదా ఉమ్రాన్ మాలిక్‌లు పేస్ బౌలర్లుగా.. స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చహల్ ఆడనున్నాడు. 


భారత తుది జట్టు (అంచనా):
శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్/ఉమ్రాన్ మాలిక్. 


డ్రీమ్ ఎలెవన్ టీమ్:
సంజు శాంసన్ (కెప్టెన్), డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), మైఖేల్ బ్రేస్‌వెల్, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్, అర్ష్‌దీప్ సింగ్. 


Also Read: ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు.. టాప్ 10 జాబితా ఇదే! అగ్రస్థానం ఏ పాముదో తెలుసా 


Also Read: Ashton Agar Fielding: బౌండరీ వద్ద అష్టన్ అగర్ కళ్లు చెదిరే విన్యాసం.. క్రికెట్‌ చరిత్రలో కనీవినీ ఎరుగని ఫీల్డింగ్!  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook