న్యూజీలాండ్ తో జరుగుతున్న రెండో  వన్డేలో కోహ్లీసేన భారీ స్కోర్ చేసింది. టీమిండియా బ్యాట్సెమెన్లు సమిష్ఠిగా రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లకు 324 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో రోహిత్ 87 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక మిగిలిన బ్యాట్స్ మెన్ల తమ వంతు సహకారం అందించారు. శిఖర్ ధావన్ 66, కెప్టెన్ విరాట్ కోహ్లీ 43, అంబటి రాయుడు 47 పరుగులు చేసి భారీ స్కోర్ కు బాటలు వేయగా..చివరి ఓవర్లలో బరిలోకి దిగిన ధోనీ 48.. కేదార్ జాదవ్ 22 పరుగులతో నాటౌట్ గా నిలిచి భారత్ కు భారీ స్కోర్ అందించారు.


కాగా 325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ..స్వల్ప వ్యవధిలోనే కీలక వికెట్లు కోల్పోయి ఎదురీదుతోంది. ఓపెనర్లు గుప్తిల్ 15 పరుగులు, మన్రో 31 పరుగుల వద్ద ఔట్ కాగా అనంతరం బరిలోకి దిగిన కెప్టెన్ విలియన్ సన్  20 పరుగుల చేసి ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ 100 పరుగులు చేసింది...రాస్ టేరల్ 22 , వికెట్ కీపర్ టాప్ లాథవ్ 10 పరుగులతో  క్రీజులో ఉన్నారు. మిగిలిన 33 ఓవర్లలో 225 పరుగుల చేయాల్సి ఉంది. కివీస్ చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. కీలక వికెట్ల కోల్పోయిన కివీస్ .. ఈ మ్యాచ్ లో గట్టెక్కాలంటే మరో వికెట్ పడకుండా భారీ భాగస్వామ్యం నెలకొల్పాల్సి ఉంది. అయితే భారత బౌలర్లు మాత్రం వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వడం లేదు..అవకాశం దొరినప్పడల్లా వికెట్ల పడగొడుతూ విజయానికి దగ్గరగా వెళ్తున్నారు.