IND VS NZ: నేడే రెండో వన్డే.. కోహ్లీని ఊరిస్తున్న మరో రికార్డు
Virat Kohli: విరాట్ కోహ్లీ సెంచరీల ఎక్స్‌ప్రెస్ మళ్లీ పట్టాలెక్కింది. వరుస శతకాలతో రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. నేడు కివీస్‌తో జరగబోయే రెండో వన్డేలోనూ కింగ్ కోహ్లీని ఓ రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో మరో 111 పరుగులు చేస్తే.. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు.
Virat Kohli: ఈ ఏడాది టీమిండియా మంచి జోరు మీద ఉంది. శ్రీలంకపై వన్డే సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. కివీస్‌పైనా అదే ఆటతీరు కనపబరుస్తోంది. తొలి వన్డేలో విజయం సాధించిన టీమిండియా.. శనివారం జరగబోయే రెండో వన్డేలోనూ విజయం సాధించి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని చూస్తోంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో ఈరోజు మధ్యాహ్నం 1:30 గంటలకు రాయ్‌పూర్‌లో జరగనుంది. మరోసారి అందరికళ్లు సూపర్ ఫామ్‌లో విరాట్ కోహ్లీపైనే ఉన్నాయి. తొలి వన్డేలో విఫలమైనా.. మళ్లీ పుంజుకుంటాడని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే తన పేరు మీద ఎన్నో రికార్డులు లిఖించుకున్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌లో మరో రికార్డు ఊరిస్తోంది.
న్యూజిలాండ్‌తో జరిగే.. రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 111 పరుగులు చేస్తే.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 25 వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. సచిన్ టెండూల్కర్ తరువాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు అవుతాడు. ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో ఈ రికార్డు సృష్టించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా విరాట్ కోహ్లీ నిలుస్తాడు. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో కింగ్ కోహ్లీ ఇప్పటివరకు 24,889 పరుగులు చేశాడు. సచిన్ టెండూల్కర్ అత్యధికంగా 34,357 రన్స్ చేశాడు.
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు
1.సచిన్ టెండూల్కర్ (భారత్)- 34357 పరుగులు
2.కుమార సంగక్కర (శ్రీలంక)- 28016 పరుగులు
3.రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 27483 పరుగులు
4.మహేల జయవర్ధనే (శ్రీలంక)- 25957 పరుగులు
5.జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా)- 25534 పరుగులు
6.విరాట్ కోహ్లీ (భారత్)- 24889 పరుగులు
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు
1.సచిన్ టెండూల్కర్ (భారత్)- 100 సెంచరీలు
2.విరాట్ కోహ్లీ (భారత్)- 74 సెంచరీలు
3.రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా)- 71 సెంచరీలు
4.కుమార్ సంగక్కర (శ్రీలంక)- 63 సెంచరీలు
5.జాక్వెస్ కల్లిస్ (దక్షిణాఫ్రికా)- 62 సెంచరీలు
6.హషీమ్ ఆమ్లా (దక్షిణాఫ్రికా)- 55 సెంచరీలు
Also Read: China Dam: సరిహద్దులో చైనా మాస్టర్ ప్లాన్.. సీక్రెట్‌గా ఆనకట్ట నిర్మాణం
Also Read: Hyper Aadi: 2024లో జనసేన ప్రభుత్వం.. సినిమాటోగ్రఫీ మంత్రిగా హైపర్ ఆది.. పోస్టులు వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి