IND Vs NZ 2nd T20: రాంచీ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం జరగనున్న రెండో టీ20ని వాయిదా వేయాలని ఆ రాష్ట్ర హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. స్థానిక లాయర్ ధీరజ్ కుమార్​.. ఝార్ఖండ్​ హైకోర్టులో ఈ పిల్​ దాఖలు చేశారు. మ్యాచ్​ చూసేందుకు 100 శాతం ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని వ్యాజ్యంలో పేర్కొన్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఝార్ఖండ్ లో కరోనా భయంతో ఇప్పటికీ పాఠశాలు మూసి ఉన్నాయని, వైరస్ భయంతో విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారని ధీరజ్ కోర్టుకు ఆ పిల్ లో విన్నవించుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రికెట్ మ్యాచుకు 100 శాతం మంది ప్రేక్షకులను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. కరోనా ఆందోళన మధ్య శుక్రవారం జరగాల్సిన మ్యాచ్ ను వాయిదా వేయడం లేదా స్టేడియంలో 50 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించేలా చర్యలు తీసుకోవాలని ధీరజ్ కోర్టును కోరారు.


ఝార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇండియా, న్యూజిలాండ్ మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం శుక్రవారం (నవంబరు 19) రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి మ్యాచు నెగ్గిన టీమ్ఇండియా.. రెండో మ్యాచ్ లోనూ గెలుపొంది సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది.


జైపూర్​ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్‌పై ఐదు వికెట్ల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల కోల్పోయి.. 164 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ వచ్చిన ఇండియన్ టీమ్.. నాలుగు వికెట్లను కోల్పోయి 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.


Also Read: ఐసీసీ క్రికెట్ కమిటీ ఛైర్మన్‌గా గంగూలీ.. అనిల్ కుంబ్లే స్థానంలో నియామకం..


Also Read: ‘ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమ్ఇండియాను పాకిస్తాన్ పంపిస్తారా?’.. కేంద్రమంత్రి అనురాగ్ స్పందన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook