IND vs NZ 3rd T20 Playing 11: టాస్ గెలిచిన భారత్.. చహల్ ఔట్! తుది జట్లు ఇవే
Yuzvendra Chahal out and Umran Malik Comes in for IND vs NZ 3rd T20I. భారత్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మరికొద్దిసేపట్లో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది.
Yuzvendra Chahal out and Umran Malik Comes in for IND vs NZ 3rd T20I: భారత్, న్యూజిలాండ్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మరికొద్దిసేపట్లో మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ స్థానంలో పేసర్ ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులోకి వచ్చాడు. వికెట్ ఫాస్ట్ బౌలర్‌లకు అనుకూలంగా ఉండనున్న నేపథ్యంలో ఉమ్రాన్‌ను తుది జట్టులోకి తీసుకున్నాం అని హార్దిక్ చెప్పాడు. కివీస్ కూడా ఒక మార్పు చేసింది.
మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్, రెండో టీ20లో భారత్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టు సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంటుంది. కివీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్.. మూడో టీ20లో కూడా గెలిచి పొట్టి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు కనీసం పొట్టి సిరీస్‌ను అయినా సాధించాలని కివీస్ చూస్తోంది.
తుది జట్లు:
భారత్: శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, శివం మావి, కుల్దీప్ యాదవ్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్.
న్యూజిలాండ్: ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే (వికెట్ కీపర్), మార్క్ ఛాప్‌మన్, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మైఖేల్ బ్రాస్‌వెల్, మిచెల్ శాంటర్న్ (కెప్టెన్), ఇష్ సోధీ, లాకీ ఫెర్గూసన్, బెన్ లిస్టర్, బ్లెయిర్ టిక్నర్.
Also Read: Womens IPL Auction 2023: ఐపీఎల్ 2023 వేలంకు ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడో తెలుసా?
Also Read: ICC T20I Rankings: దుమ్ములేపిన సూర్యకుమార్ యాదవ్.. డేవిడ్ మలన్ ఆల్‌టైమ్ రికార్డుకు ఎసరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.