IND vs NZ: Ajinkya Rahane, Ravindra Jadeja and Ishant Sharma have been ruled out of the 2nd Test: భారత్, న్యూజిలాండ్‌ (IND vs NZ) జట్ల మధ్య ముంబై వేదికగా ఇప్పటికే ప్రారంభం కావాల్సిన రెండో టెస్ట్ (2nd Test) మరింత ఆలస్యం అయ్యేలా ఉంది. గత రెండు రోజులుగా ముంబైలో వర్షం కురవడంతో వాంఖడే పిచ్ పూర్తిగా తడిసి ముద్దయింది. మ్యాచ్ ఈరోజు (డిసెంబర్ 2) ఉదయం 9 గంటలకు ఆరంభం కావాల్సి ఉండగా.. వాంఖడే పిచ్ ఔట్ ఫీల్డ్ తడిగా ఉంది. దాంతో మ్యాచుకు ముందు మైదానాన్ని పరిశీలించిన అంపైర్లు.. టాస్ (Toss) ఆలస్యం కానుందని చెప్పారు. 10. 30 గంటలకు మరోసారి పరిశీలించనున్న అంపైర్లు.. టాస్ ఎప్పుడు పడనుండో తేల్చనున్నారు. ఇరు జట్ల ఆటగాళ్లు టాస్ కోసం వెచ్చిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే రెండో టెస్టుకు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఓ కీలక ప్రకటన చేసింది. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma), ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (Ravindra Jadeja), టెస్ట్ వైస్ కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane)లు రెండో టెస్టు ఆడడం లేదని ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ ముగ్గురికి గాయాలవడమే అందుకు కారణం. ఇషాంత్ ఎడమ చిటికెన వేలికి, జడేజా కుడి ముంజేయికి, రహానే ఎడమ చేతికి గాయాలు అయినట్టు బీసీసీఐ (BCCI) తెలిపింది. రెండు టెస్ట్ సిరీసులో భాగంగా కాన్పూర్‌లో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచులో వీరికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఈ స్టార్ ప్లేయర్స్ ముగ్గురికి స్కానింగ్‌ చేయగా విశ్రాంతి అవసరం అని వైద్యబృందం తెలిపిందట. 


Also Read: ATM Cash Withdrawal Charges: జనవరి నుంచి ATM నగదు ఉపసంహరణ ఛార్జీలు పెంపు


మరోవైపు వరుస మ్యాచులు ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli).. టీ20 ప్రపంచకప్ 2021 తర్వాత వివరం తీసుకున్న విషయం తెలిసిందే. ముంబై టెస్ట్ మ్యాచ్ ద్వారా విరాట్ మైదానంలోకి దిగనున్నాడు. గాయపడిన అజింక్య రహానే (Rahane)స్థానంలో అతడు జట్టులోకి రానున్నాడు. అయితే ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజా స్థానాల్లో ఎవరు జట్టులోకి వస్తారనే ఆసక్తి నెలకొంది. ఇషాంత్ స్థానంలో మొహ్మద్ సిరాజ్ (Siraj), జడేజా స్థానంలో జయంత్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. మరి కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎవరికీ ఓటేస్తాడో చూడాలి. 




Also ReadL: Omicron cases in India: కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు.. కేంద్రం ఏం చెబుతోందంటే..


రెండో టెస్ట్ మ్యాచుకు ముందు న్యూజిలాండ్‌ జట్టుకు కూడా షాక్ తగిలింది. కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (Kane Williamson)ముంబైలో జరగనున్న రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఎడమ మోచేయికి అయిన గాయం కారణంగా కేన్ రెండో టెస్టు ఆడడం లేదని న్యూజిలాండ్‌ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. 2021 సీజన్‌లో కేన్ మామను మోచేయి గాయం ఇబ్బంది పెడుతున్న విషయం తెలిసిందే. ఇక టామ్ లాథమ్ (Tom Latham) న్యూజిలాండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఇక విలియమ్సన్ స్థానంలో ఆడే ప్లేయర్ ఎవరో కివీస్ బోర్డు ప్రకటించలేదు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook