IND vs NZ: రాహుల్ ద్రవిడ్‌కు విరామం అవసరమే.. రవిశాస్త్రి వ్యాఖ్యలపై మండిపడ్డ అశ్విన్!
R Ashwin Defends India Head Coach Rahul Dravid. రవిశాస్త్రి వ్యాఖ్యలపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ద్రవిడ్‌కు విరామం అవసరమే అని చెప్పారు.
R Ashwin says Break Needed for India Head Coach Rahul Dravid due to hard work: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదేపదే విరామం తీసుకోవాల్సిన అవసరం ఏంటని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి తాజాగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఐపీఎల్ టోర్నీ సమయంలో లభించే 45-60 రోజుల విరామం సరిపోతుంది కదా? అని పేర్కొన్నారు. కోచ్ నిత్యం ఆటగాళ్లతో ఉండాలని, ఇలా విశ్రాంతి పేరుతో జట్టుకు దూరం అవడం సమంజసం కాదని రవిశాస్త్రి మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై భారత వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ద్రవిడ్‌కు విరామం అవసరమే అని చెప్పారు.
ఆర్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు విశ్రాంతినివ్వడం, వీవీఎస్ లక్ష్మణ్ ఆ బాధ్యతలను చేపట్టడం వంటి అంశాలను మరో విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అందుకే నేను నా అభిప్రాయం చెపుతున్నా. ప్లానింగ్ నుంచి మొదలుకొని టీ20 ప్రపంచకప్ 2022 పూర్తమ్యే వరకు ద్రవిడ్, సహాయక బృందం తీవ్రంగా శ్రమించింది. అది నేను దగ్గరుండి చూశాను. ప్రతి ఒక్క మ్యాచ్‌కు వారికి ప్రత్యేక ప్రణాళికలు ఉంటాయి. అవి శారీరకంగానే కాక మానసికంగా కూడా శక్తిని హరిస్తుంది. అందుకే కచ్చితంగా ప్రతి ఒక్కరికి కాస్త విరామం అవసరం' అని అన్నాడు.
'ప్రస్తుతం జరుగుతున్న న్యూజిలాండ్ సిరీస్ అనంతరం బంగ్లాదేశ్ పర్యటన ఉంది. అందుకే వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో కొత్త బృందం న్యూజిలాండ్ సిరీస్‌కు పనిచేస్తోంది. భారత క్రికెట్‌లో ఎంతో మంది ప్రతిభ గలవారు ఉన్నారు. ఆటగాళ్లు మాత్రమే కాకుండా కోచింగ్ పరంగా కూడా కొత్త వారికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. ఇందుకు ఇదే నిదర్శనం' అని ఆర్ అశ్విన్ చెప్పాడు. న్యూజిలాండ్ పర్యటనకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే.
న్యూజిలాండ్ పర్యటనకు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, మహమ్మద్ షమీ, ఆర్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా దూరంగా ఉన్నారు. రోహిత్ గైర్హాజరీలో టీ20ల్లో హార్దిక్ పాండ్యా, వన్డేల్లో శిఖర్ ధావన్ భారత జట్టును నడిపించనున్నారు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణమైన విషయం తెలిసిందే. దాంతో మిగిలిన రెండు మ్యాచ్‌లను ఎవరు గెలిస్తే.. వారిదే పొట్టి సిరీస్.
Also Read: Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈజ్ బ్యాక్.. ట్విట్టర్ అకౌంట్ రీ ఓపెన్.. కానీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.