Shreyas Iyer 3rd Indian To Score Century On Test Debut vs New Zealand: రెండు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా యువ బ్యాటర్‌ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer) అదరగొట్టాడు. అరంగేట్ర టెస్టులోనే సెంచరీ చేసి ఔరా అనిపించాడు. 75 పరుగులతో రెండో రోజు తన ఆటను ప్రారంభించిన అయ్యర్.. కివీస్ బౌలర్లపై విరుచుకుపడుతూ బౌండరీల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో కైల్ జేమీసన్ (Kyle Jamieson) వేసిన 92వ ఓవర్ మొదటి బంతికి రెండు పరుగులు చేసి.. మూడంకెల స్కోర్ అందుకున్నాడు. దీంతో అరంగేట్రంలోనే సెంచరీ చేసిన 16వ టీమిండియా ఆటగాడిగా శ్రేయాస్ రికార్డల్లో నిలిచాడు. అంతేకాదు న్యూజిలాండ్‌పై అరంగేట్ర టెస్టు (Test debut century)లోనే సెంచరీ చేసిన మూడో భారత బ్యాటర్‌గా కూడా రికార్డు నెలకొల్పాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శ్రేయాస్ అయ్యర్ కంటే ముందు 2018 అక్టోబర్‌లో రాజ్‌కోట్‌లో వెస్టిండీస్‌పై పృథ్వీ షా (Prithvi Shaw) అరంగేట్రం టెస్టులో సెంచరీ చేశాడు. అయితే అరంగేట్రంలోనే సెంచరీ చేసిన మొదటి భారతీయుడు మాత్రం లాలా అమర్‌నాథ్ (Lala Amarnath). అతడు 1933లో అరంగేట్ర టెస్టులో శతకం నమోదు చేశాడు. ఈ జాబితాలో ఆర్‌ఎచ్ శోధన్, కృపాల్ సింగ్, అబ్బాస్ అలీ బేగ్, హనుమంత్ సింగ్, గుండప్ప విశ్వనాథ్, సురీందర్ అమర్‌నాథ్, మహ్మద్ అజారుద్దీన్, ప్రవీణ్ ఆమ్రే, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, సురేష్ రైనా, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షా, శ్రేయాస్ అయ్యర్ వరుసగా ఉన్నారు. 


Also Read: Samantha: హాలీవుడ్‌‌లోకి సమంత ఎంట్రీ షురూ...అఫీషియల్ గా ప్రకటించిన సామ్..!


గురువారం దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ నుంచి టెస్టు క్యాప్ అందుకున్న శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer).. కాన్పూర్‌లో అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా కూడా నిలిచాడు. 1969లో ఆస్ట్రేలియాపై విశ్వనాథ్ ఈ ఘనత సాధించాడు. కృపాల్ సింగ్ మరియు సురీందర్ అమర్‌నాథ్ తర్వాత న్యూజిలాండ్‌పై అరంగేట్రం టెస్టులో శతకం సాధించిన మూడో భారత బ్యాటర్‌గా అయ్యర్ రికార్డు నెలకొల్పాడు. ఇక స్వదేశంలో అరంగేట్రం టెస్టులో శతకం బాదిన 10 భారత బ్యాటర్‌గా అయ్యర్ మరో రికార్డు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. లాలా అమర్‌నాథ్, దీపక్ శోధన్, కృపాల్ సింగ్, హనుమంత్ సింగ్, గుండప్ప విశ్వనాథ్, మహ్మద్ అజారుద్దీన్, శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, పృథ్వీ షాలు ఈ జాబితాలో ఉన్నారు. 


Also Read: Nara Bhuvaneswari: 'నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదు'..: నారా భువనేశ్వరి


రెండో రోజు ఓవర్ నైట్ స్కోర్ 258/4తో ఆట ప్రారంభమయ్యాక టీమిండియాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. తొలి రోజు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer)​తో కలిసి కీలక ఇన్నింగ్స్​ ఆడిన స్టార్ ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా (50) ఔట్ అయ్యాడు. తన ఓవర్ నైట్ స్కోరుకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే టీమ్ సౌథీ బౌలింగ్​లో ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (1), ఆల్​రౌండర్ అక్షర్ పటేల్ (3) నిరాశపరిచారు. అయితే రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin)మాత్రం పోరాడుతున్నాడు. భారత్ 102 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది. అశ్విన్ (27), ఉమేష్ యాదవ్ (0) క్రీజులో ఉన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook