Wasim Jaffer Picks India Playing 11 vs New Zealand for 3rd T20I: భారత్, న్యూజిలాండ్‌ జట్ల మధ్య కీలకమైన మూడో టీ20 మ్యాచ్‌ అహ్మదాబాద్‌లో జరగనుంది. బుధవారం సాయంత్రం 6.30 గంటలకు టాస్ పడనుండగా.. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. దాంతో నేటి మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్ సొంతం చేసుకుంటుంది. అయితే ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగే భారత తుది జట్టుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీమ్ జాఫర్ కీలక సూచనలు చేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీమిండియా పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉందని వసీమ్ జాఫర్ పేర్కొన్నాడు. మూడో టీ20 మ్యాచ్‌లో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు తుది జట్టులో అవకాశం కల్పించాలని సూచించాడు. ఈఎస్‌‍పీఎన్-క్రిక్‌ఇన్ఫోలో జాఫర్ మాట్లాడుతూ... 'స్పిన్‌ బౌలింగ్‌తో న్యూజిలాండ్‌ బాగా ఇబ్బంది పడుతోంది. కాబట్టి యుజ్వేంద్ర చహల్‌ను మూడో మ్యాచ్‌లోనూ కొనసాగించాలి. మణికట్టు బౌలర్ ఉన్నప్పుడు కచ్చితంగా అతడి సేవలు వినియోగించుకోవాలి. ఇది జట్టుకు లభించే అంశం' అని అన్నారు.


'ఇంతకుముందు చెప్పినట్లు ఉమ్రాన్ మాలిక్‌ టీ20 ఫార్మాట్‌లో ఇబ్బంది పడుతున్నాడు. విభిన్నంగా బంతులను సంధించడంపై కసరత్తు చేయాలి. టీ20ల్లో వేరియేషన్‌ కచ్చితంగా ఉండాలి. కివీస్‌పై యుజ్వేంద్ర చహల్‌ను ఆడించడం ఉత్తమ ఎంపిక అవుతుంది. బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ తడబాటుకు గురవుతున్నాడు. గిల్ స్థానంలో పృథ్వీ షాను ఆడిస్తే బాగుంటుంది. పృథ్వీ షా టీ20 ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోతాడు. మరోవైపు తొలి రెండు మ్యాచుల్లో విఫలమైన ఇషాన్‌ కిషన్, రాహుల్‌ త్రిపాఠి ఆటతీరుపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు. వారు పరుగులు చేస్తారు' అని వసీమ్ జాఫర్ ధీమా వ్యక్తం చేశారు. 


భారత తుది జట్టు:
పృథ్వీ షా, ఇషాన్‌ కిషన్, రాహుల్‌ త్రిపాఠి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చహల్, అర్ష్‌దీప్‌ సింగ్. 


Also Read: Suryakumar Yadav Record: భారత్, న్యూజిలాండ్‌ మూడో టీ20.. అరుదైన రికార్డుపై కన్నేసిన సూర్యకుమార్ యాదవ్!  


Also Read: Budget 2023-24: మహిళలకు కొత్త స్కీమ్‌.. వృద్ధులకు శుభవార్త! బడ్జెట్‌లో మొదటిసారి ఓ కొత్త ప్యాకేజీ  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.