IND vs PAK 1st Innings Updates: టీమిండియా బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్ విలవిలాడిపోయారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు 42.5 ఓవర్లలో 191 పరుగులకే కూప్పకూలింది.  కెప్టెన్ బాబర్ అజామ్ (50), మహ్మద్ రిజ్వాన్ (49), ఇమామ్ ఉల్ హక్ (36) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా ఇలా వచ్చి అలా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్.. మొదట బౌలింగ్ ఎంచుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్, ఇమామ్ ఉల్ హక్ తొలి వికెట్‌కు 8 ఓవర్లలో 41 పరుగులు జోడించారు. 20 పరుగుల చేసిన షఫీక్ సిరాజ్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. ఆ తరువాత 36 పరుగులు చేసిన ఇమామ్‌ ఉల్ హాక్‌ను హర్థిక్ పాండ్యా ఔట్ చేశాడు. అనంతరం కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌, రిజ్వాన్‌లు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. చక్కగా సింగిల్స్ తీస్తూ.. వీలు చిక్కినప్పుడుల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో బాబర్ 58 బంతుల్లో 50 హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వెంటనే బాబర్‌ను సిరాజ్ క్లీన్‌బౌల్డ్ చేయడంతో మ్యాచ్‌ మలుపు తిరిగింది. దీంతో 155 పరుగుల వద్ద మూడో వికెట్ పడింది.


ఆ తరువాత పాక్ ఇన్నింగ్స్ పేక మేడలా కుప్పకూలింది. షకీల్ (4), ఇఫ్తికర్ అహ్మద్ (4), రిజ్వాన్ (49), షాదాబ్ ఖాన్ (2), హసన్ అలీ (12) వెంటవెంటనే ఔట్ అవ్వడంతో పాక్ జట్టు కోలులేకపోయింది. దీంతో 36 పరుగుల వ్యవధిలోనే 8 వికెట్లు కోల్పోయింది. 192 పరుగుల లక్ష్యంతో భారత్ బరిలోకి దిగనుంది. లక్ష్యం స్వల్పమే అయినా.. పాక్ బౌలింగ్ బలంగా ఉండడంతో టీమిండియా కాస్త జాగ్రత్తగా ఆడి లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉంది. 


Also Read: Oppo Reno10 Pro+ 5G Price: బంఫర్‌ ఆఫర్‌ మీ కోసం..Oppo Reno10 Pro+ 5G మొబైల్‌ రూ. 17,549కే..నమ్మట్లేదా?  


Also Read: Bathukamma Festival Special: బతుకమ్మ పండుగ స్పెషల్.. ఈ పూలలో దాగిన ఔషధ గుణాలు ఎన్నో..!  


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి