IND vs PAK, Afghanistan Fan Kisses Hardik Pandya: ఆసియా కప్‌ 2022లో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన మ్యాచులో స్టార్ ఆల్‌రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా సిక్స్‌ కొట్టి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్‌ చేసిన పాక్ 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ ఐదు వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో 148 రన్స్ చేసి విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మ్యాచులో హార్దిక్‌ పాండ్యా హీరో అని చెప్పాలి. ముందుగా హార్దిక్ బంతితో (3/25) మాయ చేశాడు. కీలకమైన సమయంలో వికెట్లు తీసి పాక్ నడ్డివిరిచాడు. ఆపై బ్యాటింగ్‌లో (33 నాటౌట్‌; 17 బంతుల్లో 4×4, 1×6) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ అనంతరం క్రీజులోకి వచ్చిన హార్దిక్‌.. రవీంద్ర జడేజా (35; 29 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి టీమిండియాను విజయంవైపు నడిపించాడు. ఇక జడేజా ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి నిష్క్రమించిన తర్వాత.. నాలుగో బంతికి సిక్స్ బాది అద్భుత విజయం అందించాడు. 



హార్దిక్ పాండ్యా సిక్సర్ కొట్టగానే స్టేడియంతో పాటు దేశం మొత్తంలో సంబరాలు అంబరాన్నంటాయి. కేవలం భారతీయులే కాదు.. ఆఫ్ఘనిస్థాన్‌లోని అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్‌లోని కొందరు యువకులు భారత్, పాకిస్తాన్ మ్యాచును చూశారు. ఉత్కంఠ మధ్య హార్దిక్ సిక్స్ బాదగానే ఓ యువకుడి పరుగెత్తుకుంటూ టీవీ స్క్రీన్‌ వద్దకు వచ్చి హార్దిక్ పాండ్యాను ముద్దుపెట్టుకుని వెళ్ళిపోయాడు. ఇది చూసిన అతడి స్నేహితులు నవ్వలు పూయించారు. ఈ వీడియో మహిళా హక్కుల కార్యకర్త యూసఫ్‌జాయ్ అనయత్ షేర్ చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. 


Also Read: Viral Video: రైలుకి ఎదురెళ్లిన యువతి.. హారన్ కొడుతున్నా పట్టించుకోలేదు! ఇంతలోనే..


Also Read: జాతీయ క్రీడా దినోత్సవం.. మనలో ఆత్మవిశ్వాసం నింపి జోష్‌నిచ్చే బ్లాక్‌బస్టర్ సినిమాలు ఇవే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి