Virat Kohli says Iam not ashamed to say that I was mentally depressed: గత పది ఏళ్లలో నెల రోజుల పాటు తాను బ్యాట్‌ను పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి అని టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తెలిపాడు. మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి తానేం సిగ్గుపడడడం లేదని, ఇది చాలా సాధారణ విషయమే అయినా దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తామన్నాడు. గత మూడేళ్ళుగా సరైన ప్రదర్శన చేయని కోహ్లీపై గత కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆట నుంచి విరామం తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వెస్టిండీస్‌, జింబాబ్వే సిరీస్‌లకు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ ఆసియా కప్‌ 2022లో బరిలోకి దిగనున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆసియా కప్‌ 2022లో భాగంగా ఆదివారం పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా పునరాగమనం చేయనున్న విరాట్ కోహ్లీ.. బీసీసీఐ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడాడు. 'గత 10 ఏళ్లలో నెల రోజుల పాటు బ్యాట్‌ పట్టుకోకుండా ఉండటం ఇదే తొలిసారి. కొన్ని రోజులుగా నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించా. నువ్వు చేయగలవు, పోరాడగలవు అని నాకు నేను సర్దిచెప్పుకున్నా. కానీ నా శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. విశ్రాంతి తీసుకోవాలని మనసు సూచించింది. నేను మానసికంగా దృఢంగా ఉన్నా.. ప్రతి ఒక్కరికీ కొన్ని పరిమితులుంటాయి. వాటిని మనం గుర్తించాలి' అని కోహ్లీ అన్నాడు.


'విరామ సమయంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నా. మానసికంగా కుంగిపోయానని చెప్పుకొనేందుకు నేను సిగ్గుపడను. ఈ రోజు ఎలా ఉంటుందో చూద్దామకునే వ్యక్తిని నేను. ఏ పనిలోనైనా 100 శాతం కష్టపడుతా. మైదానంలో ఇలా ఎలా ఉంటారు, ఆ సామర్థ్యాన్ని ఎలా కొనసాగిస్తున్నారని చాలా మంది అడుగుతుంటారు. నాకు ఆట మీదున్న ప్రేమ వల్లే ఇదంతా చేస్తున్నా. ప్రతి బంతితో జట్టుకు సహకరించాల్సింది ఇంకా ఎంతో ఉందని భావిస్తా. మైదానంలోనూ చాలా కష్టపడుతా. ఎట్టి పరిస్థితుల్లోనైనా నా జట్టు గెలవాలనేదే నా లక్ష్యం' అని విరాట్ కోహ్లీ చెప్పకొచ్చాడు. 


జూన్ నెలలో ఇంగ్లండ్‌తో జరిగిన పర్యటనలో విరాట్ కోహ్లీ పరుగులు చేయలేకపోయాడు. ఒక టెస్టు, రెండు టీ20లు, రెండు వన్డే మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 76 పరుగులే చేశాడు. దాంతో కోహ్లీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మాజీల సలహాల మేరకు బీసీసీఐ అతడికి విశ్రాంతినివ్వడంతో.. వెస్టిండీస్‌, జింబాబ్వే పర్యటనలకు దూరమయ్యాడు. నెల రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న కోహ్లీ.. ఆసియా కప్‌ 2022తో మళ్లీ మైదానంలోకి దిగనున్నాడు.


Also Read:  హిందీ పాటకు ఆఫ్రికా పిల్లల డాన్స్.. వీడియో చూస్తే మైండ్ బ్లాక్ అవుద్ది!


Also Read: BJP WITH FILM STARS: మొన్న మెగాస్టార్.. నిన్న తారక్.. నేడు నితిన్! బీజేపీ కాపు, కమ్మ, రెడ్డి కాంబినేషన్ అదుర్స్...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook