IND vs PAK Live Updates: మళ్లీ చెలరేగిన రోహిత్.. పాక్ పై అలవోకగా గెలిచిన భారత్..
Ind vs Pak Match Highlights: చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. దాయాదిపై ఏడు వికెట్లు తేడాతో గెలిచింది భారత్. ప్రపంచకప్ ల్లో పాక్ పై ఓటమెరగని రికార్డును కొనసాగించింది.
ODI World Cup 2023, Ind vs Pak Live Score: పాకిస్థాన్ జైత్రయాత్రకు టీమిండియా బ్రేక్ వేసింది. వరల్డ్ కప్ లో వరుసగా హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది రోహిత్ సేన. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో దాయాదుల మధ్య జరిగిన పోరులో పాకిస్థాన్‌పై భారత్ మూడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి రోహిత్ తన విశ్వరూపాన్ని చూపించాడు. శ్రేయస్ బాధ్యయుతంగా ఆడి భారత్ కు విజయాన్ని కట్టబెట్టాడు.
బాబర్ నిలిచినా..
తొలుత టాస్ ఓడి పాకిస్థాన్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు షఫీక్, ఇమామ్ హుల్ హక్ భారత పేస్ దళాన్ని దీటుగానే ఎదుర్కోన్నారు. ఆచిచూతి ఆడుతూ స్కోరు వేగాన్ని పెంచారు. 41 పరుగుల వద్ద షఫీక్ వికెట్ కోల్పయింది పాక్. అనంతరం క్రీజులోకి వచ్చిన బాబర్ ఆజమ్ ఈ మ్యాచ్ ద్వారా ఫామ్ లోకి వచ్చాడు. 73 పరుగలు వద్ద ఇమామ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిజ్వాన్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు బాబర్. వీరిద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ రన్స్ పెంచారు. అయితే 155 పరుగుల వద్ద బాబర్ వికెట్ పడటంతో.. దాయాది బ్యాటర్లు వరుసగా క్యూ కట్టారు. దీంతో పాక్ స్వల్ప స్కోరుకే కుప్పకూలింది. 42.5 ఓవర్లలో చిరకాల ప్రత్యర్థి 191 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా, సిరాజ్, పాండ్యా, కులదీప్, జడేజా రెండేసి వికెట్లు తీశారు.
రోహిత్ దూకుడు.. శ్రేయస్ నిలకడ..
అనంతరం లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగి టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా తన జోరును కొనసాగించాడు. ఫోర్లు, సిక్సర్లు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు హిట్ మ్యాన్. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన శుభమన్ కేవలం 16 పరుగుల చేసి ఔటయ్యాడు. స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా ఎంత సేపు క్రీజులో నిలవలేదు. ఇతడు కూడా 16 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం శ్రేయస్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు రోహిత్. కేవలం 63 బంతుల్లోనే 86 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. రోహిత్ ఔటైనా రాహుల్ అండతో శ్రేయస్ చివరి క్రీజులో నిలబడి భారత్ కు విజయాన్ని అందించాడు. శ్రేయస్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇతడి ఇన్నింగ్స్ లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. పాక్ బౌలర్లలో షహీన్ ఆఫ్రిది రెండు వికెట్లు తీశాడు. ప్రపంచకప్ ల్లో పాక్ పై ఓటమెరగని రికార్డును కొనసాగించింది టీమిండియా. భారత్ ఆధిక్యం 8-0కి చేరింది.
Also Read: NZ vs BAN Highlights: రీఎంట్రీలో అదరగొట్టిన విలియమ్సన్.. బంగ్లాపై కివీస్ ఘన విజయం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి