India vs Pakistan World Cup 2023 Updates Toss and Playing 11: వరల్డ్ కప్‌లో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ్యాచ్‌ ఆరంభమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా టీమిండియా, పాకిస్థాన్ జట్ల మధ్య పోరు మొదలైంది. విశ్వకప్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో రెండు జట్లు విజయం సాధించి.. ఈ పోరుకు రెడీ అయ్యాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో హైఓల్టేజీ పోరులో పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ చేయనుంది. డెంగ్యూ బారినపడి కోలుకున్న యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్‌నెస్‌తో తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో ఇషాన్ కిషన్ బెంచ్‌కే పరిమితమయ్యాడు. పాకిస్థాన్ జట్టు మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మేము ముందుగా బౌలింగ్ చేస్తాం. అద్భుత వాతావరణం ఉంది. ఇది మంచి పిచ్. మంచు ప్రభావం చూపించే అవకాశం ఉంది. దానిని దృష్టిలో ఉంచుకుని మేము ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఇలాంటి టోర్నీలో జట్టులో వాతావరణాన్ని రిలాక్స్‌గా ఉంచడం చాలా ముఖ్యం. ఇషాన్ కిషన్ స్థానంలో గిల్ తిరిగి వచ్చాడు. ఇషాన్ గురించి బాధపడుతున్నాం. జట్లుకు అవసరమైనప్పుడు ముందుకు వచ్చాడు. గిల్ గతేడాది నుంచి  మాకు ప్రత్యేక ఆటగాడిగా ఉన్నాడు. ముఖ్యంగా ఈ గ్రౌండ్‌లో తిరిగి ఆడాలని కోరుకుంటున్నాము.." అని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు.


"మేము కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. ఈ టోర్నీలో రెండు విజయాలు సాధించడంతో పూర్తి విశ్వాంసంతో ఉన్నాం. ఇక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉన్నారు. మేము ఫీల్డ్‌లో మంచిగా ఉండాలనుకుంటున్నాం. ఇక్కడ రెండు మంచి ప్రాక్టీస్ సెషన్‌లను పూర్తి చేశాం. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం." అని పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ తెలిపాడు.


తుది జట్లు ఇలా..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్


పాకిస్థాన్: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ అజామ్ (కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.


Also Read: Hyderabad: ఇద్దరు కూతుళ్లకు నిద్రమాత్రలు ఇచ్చి చంపేసిన తండ్రి.. వెంటనే తానూ కూడా..!  


Also Read: World Cup 2023 Points Table: టాప్ ప్లేస్‌కు దూసుకువచ్చిన సఫారీ.. టీమిండియా ఎన్నో స్థానంలో ఉందంటే..?  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి