Sachin Tendulkar predicts India to beat Pakistan in T20 World Cup 2022: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టీ20 ప్రపంచకప్ 2022 ఆరంభం అయింది. ఆదివారం (అక్టోబర్ 16) నుంచి గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. సూపర్ 12 మ్యాచులు అక్టోబర్ 22 నుంచి ఆరంభం కానున్నాయి. మెగా టోర్నీ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 23న దాయాదులు భారత్, పాకిస్తాన్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాయాదుల సమరం నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించారు. పాకిస్తాన్‌ను భారత్ ఓడిస్తుందని జోస్యం చెప్పారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టెలిగ్రాఫ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ... 'దాయాదుల పోరులో భారత్ నా ఫేవరేట్. ఓ భారతీయుడిగా టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవాలని ఎప్పుడూ కోరుకుంటా. నేను భారతీయుడిని అయినందున మాత్రమే కాదు.. ప్రస్తతం రోహిత్ సేన మంచి ప్రదర్శన చేస్తోంది. అందుకే భారత్ గెలుస్తుందని నేను నమ్ముతున్నా. భారత్ పటిష్టంగా ఉంది. ప్రస్తుతం జట్టు బ్యాలెన్స్‌గా ఉంది. కాంబినేషన్ కూడా కుదిరాయి. ట్రోఫీ గెలవడానికి భారత్‌కు చాలా మంచి అవకాశం' అని అన్నారు. 


'టీ20 ప్రపంచకప్ 2022లో భారత్‌ ఛాంపియన్‌గా నిలవాలని నేను కోరుకుంటున్నాను. సెమీస్ వెళ్లే నాలుగు జట్లు భారత్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా మరియు ఇంగ్లండ్‌. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు శ్రమించక తప్పదు. పరిస్థితులకు అనుగుణంగా ఈ రెండు జట్లు కూడా చెలరేగుతాయి' అని సచిన్ టెండూల్కర్ అన్నారు. మరి సచిన్ చెప్పినట్టు పాకిస్తాన్‌ను ఓడిస్తుందో లేదో చూడాలి. 


టీ20 ప్రపంచకప్ 2022 ఫైనల్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడొచ్చని ఇప్పటికే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ జోస్యం చెప్పారు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్యే ఫైనల్ జరుగుతుందని.. కొద్దిగా కష్టపడితే పాకిస్తాన్‌కూ ఆ అవకాశం ఉందని గేల్ పేర్కొన్నారు. వెస్టిండీస్‌ జట్టుపై పెద్దగా అంచనాలేవీ లేవని ఆయన చెప్పుకొచ్చారు.


Also Read: టీ20 ప్రపంచకప్‌కు ముందు.. క్రికెట్ ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం! వార్నర్‌కు షాక్


Also Read: T20 World Cup 2022: టీమిండియాకు మళ్లీ షాక్... మరో స్టార్ ప్లేయర్​కు గాయం..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook