Shahnawaz Dahani ruled out from India vs Pakistan Asia Cup 2022 Match: ఆసియా కప్‌ 2022లో పాకిస్థాన్‌కు వరుస దెబ్బలు తగులుతున్న విషయం తెలిసిందే. టోర్నీ ఆరంభానికి ముందే స్టార్ పేసర్ షాహిన్ షా ఆఫ్రిది, మహమ్మద్ వసీం జూనియర్ గాయాలతో దూరం కాగా.. మరో బౌలర్ నసీమ్ షా టీమిండియాతో జరిగిన మ్యాచులో గాయపడ్డాడు. అయితే నసీమ్ కోలుకున్నాడని సంతోషించే లోపే పాక్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్‌ షాహనవాజ్‌ దహనీ పక్కటెముకల గాయంతో టీమిండియా మ్యాచ్‌కు దూరమయ్యాడు. సూపర్ 4లో ఆదివారం భారత్‌తో జరిగే మ్యాచ్ కీలకం కాబట్టి పాకిస్తాన్‌ మేనేజ్మెంట్ నిరాశ వ్యక్తం చేస్తుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

షానవాజ్ దహాని పక్కటెముకల గాయంతో భారత్‌తో ఆదివారం జరిగే మ్యాచ్‌కు దూరమయ్యాడని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. 'టీమిండియాతో ఆదివారం జరగనున్న ఆసియా కప్ 2022 సూపర్ 4 మ్యాచ్‌కు పేసర్ షానవాజ్ దహాని దూరయ్యాడు. పక్కటెముకల గాయంతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్ చేస్తుండగా.. దహాని గాయపడ్డాడు. 48 గంటలు గడిస్తే కానీ దహనీ గాయంపై స్పష్టత రానుంది. దహని స్థానంలో హసన్‌ అలీ లేదా ముహ్మద్‌ హస్నైన్‌లలో ఒకరు మ్యాచ్ ఆడుతారు' అని పీసీబీ తెలిపింది. 


శుక్రవారం హాంగ్‌ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలింగ్‌ చేస్తూనే షానవాజ్ దహనీ గాయపడ్డాడు. గాయం అయినా కూడా దహనీ తన కోటా ఓవర్లు పూర్తి చేశాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో భారత్‌తో మ్యాచ్‌కు దూరమయ్యాడు. దాంతో భారత్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. షాహిన్ షా అఫ్రిది, మహమ్మద్ వసీం జూనియర్, షానవాజ్ దహనీ లేకున్నా.. పాకిస్తాన్ బౌలింగ్ పటిష్టంగానే ఉంది. నసీమ్‌ షా, హారిస్‌ రౌఫ్‌, మహ్మద్‌ నవాజ్‌, షాదాబ్‌ ఖాన్‌ల పాకిస్తాన్‌కు అందుబాటులో ఉన్నారు. 


మరోవైపు టీమిండియా కూడా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా సేవలను కోల్పోయిన విషయం తెలిసిందే. మొకాలి గాయంతో జడ్డు టోర్నీ మొత్తానికి దూరం కావాల్సి వచ్చింది. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. అయితే అతడికి తుది జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి. ఆసియా కప్‌ 2022లో భారత్ , పాకిస్తాన్‌ ఇదివరకే పోటీ పడగా.. రోహిత్ సేన విజయం సాధించింది. రేపు జరిగే మ్యాచులో ఎవరు గెలుస్తారో చూడాలి. 


Also Read: బ్ర‌హ్మ‌స్త్ర‌ ప్రేస్‌ మీట్‌లో ఆలియా భ‌ట్ సందడి.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!


Also Read: 'సమంతతో ఇక నా ప్రయాణం ముగిసినట్టే.. అంత మాత్రాన మేం విడిపోయినట్లు కాదు'


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook