Rohit Sharma-Virat Kohli: హ్యాట్సాఫ్ విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ నాక్‌లలో ఇది ఒకటి: రోహిత్ శర్మ
T20 World Cup 2022 India vs Pakistan: Rohit Sharma praises on Virat Kohli. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ ప్రశంసించాడు.
Rohit Sharma heap praises on Virat Kohli after 82 runs vs Pakistan: టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ (82; 53 బంతుల్లో 6X4, 4X6)ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసించాడు. కోహ్లీ అత్యుత్తమమైన ఇన్నింగ్స్ ఆడాడని, భారతదేశపు అత్యుత్తమ నాక్‌లలో ఇది ఒకటి అని తాను భావిస్తున్నా అని చెప్పాడు. మ్యాచ్ ఫలితం తనకు నోటమాట రానివ్వలేదని రోహిత్ చెప్పాడు. ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో నాలుగు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దాంతో మెగా టోర్నీలో రోహిత్ సేన శుభారంభం చేసింది.
మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ... 'మ్యాచ్ ఫలితంతో నాకు నోట మాట రావట్లేదు. వీలైనంత వరకు ఎక్కువ సమయం ఆటలో ఉండేందుకే మేం ప్రయత్నించాం. ఇక్కడి పిచ్‌లోనే ఏదో మ్యాజిక్ ఉంది. ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్ కలిసి చివరి వరకు గట్టి పోటీనిచ్చారు. లక్ష్యాన్ని ఛేదించడానికి ఎంతో శ్రమించాల్సి వస్తుందని మాకు ముందే తెలుసు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా ప్రశాంతంగా ఆడి ఆటను మలుపుతిప్పారు. ఓడిపోతామనుకుని తిరిగి విజయం సాధించడం మరింత ఆనందంగా ఉంది' అని అన్నాడు.
'విరాట్ కోహ్లీకి హ్యాట్సాఫ్. అద్భుతంగా ఆడాడు. విరాట్ కెరీర్‌లోనే కాదు భారతదేశపు అత్యుత్తమ నాక్‌లలో ఇది ఒకటి అని నేను భావిస్తున్నా. 13వ ఓవర్ పూర్తయ్యేవరకు 100 పరుగులు అవసరం. మేము గేమ్‌లో చాలా వెనుకబడి ఉన్నాము. రన్ రేట్ అప్పుడప్పుడే పెరుగుతుంది. కానీ విరాట్ ఆ స్కోర్‌ను ఛేజ్ చేయడం అద్భుతం. గొప్ప ప్రయత్నం చేశాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా మంచి నాక్ ఆడాడు' అని రోహిత్ శర్మ చెప్పాడు.
Also Read: Virat Kohli, Anushka Sharma: మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా ?
Also Read: Blenders Pride Full Bottle: ఓటరుకో బ్లెండర్స్ ప్రైడ్ ఫుల్ బాటిల్ మద్యం పంపిణి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి