`మొహ్మద్ నవాజ్` నువ్వే మా హీరో.. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం! లవ్ యూ భయ్యా

India vs Pakistan T20 World Cup 2022 Best Memes. భారత్ vs పాకిస్తాన్ మ్యాచుపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. `మొహ్మద్ నవాజ్ నువ్వే మా హీరో.. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా` అంటూ సెటైర్లు పేలుతున్నాయి.
IND vs PAK, Indian Fans trolls Pakistan Bowler Mohammad Nawaz: భారత ప్రజలు 'దీపావళి' పండుగను ఒక రోజు ముందే చేసుకున్నారు. టీ20 ప్రపంచకప్ 2022లో ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై చిరస్మరణీయ విజయం సాదించి అభిమానులకు భారత జట్టు పండుగ కానుకను అందించింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (82 నాటౌట్; 53 బంతుల్లో 6×4, 4×6) భారత క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (40; 37 బంతుల్లో 1×4, 2×6) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో.. 160 పరుగుల లక్ష్యాన్ని భారత్ చివరి బంతికి ఛేదించింది. దాంతో భారత అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
160 పరుగుల లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా పోరాడుతున్నారు. భారత్ పుంజుకుంటున్న దశలో 16, 17 ఓవర్లు దెబ్బకొట్టాయి. హరీష్ రవూఫ్, నసీమ్ షాలు తలో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చారు. దాంతో 5 ఓవర్లకు 60గా ఉన్న సమీకరణం.. 3 ఓవర్లకు 48గా మారింది. దాంతో భారత్ గెలవడం ఇక కష్టమే అనిపించింది. షహీన్ వేసిన 18వ ఓవర్లో కోహ్లీ మూడు బౌండరీలు బాదడంతో.. 17 పరుగులు వచ్చాయి. ఇక చివరి 2 ఓవర్లలో 31 పరుగులు చేయాలి. 19వ ఓవర్లో రవూఫ్ మొదటి 4 బంతుల్లో మూడే పరుగులు ఇచ్చాడు. దాంతో సమీకరణం 8 బంతుల్లో 28 పరుగులుగా మారింది. ఇక భారత్ ఓటమి ఖాయం అనుకున్నారు అందరూ. ఈ దశలో విరాట్ చివరి రెండు బంతులను సిక్సర్లుగా బాదేశాడు.
చివరి ఓవర్‌లో భారత్ లక్ష్యం 16 పరుగులు. హార్దిక్ పాండ్య స్ట్రైకింగ్‌లో ఉండగా.. స్పిన్నర్ మొహ్మద్ నవాజ్ బంతిని అందుకున్నాడు. సిక్సర్ బాదుతాడనుకున్న హార్దిక్.. తొలి బంతికే క్యాచ్ ఔట్ అయ్యాడు. రెండో బంతికి దినేష్ కార్తీక్ సింగిల్ మాత్రమే తీశాడు. మూడో బంతికి కోహ్లీ రెండు పరుగులే చేశాడు. దాంతో సమీకరణం 3 బంతుల్లో 13 పరుగులుగా మారింది. నాలుగో బంతిని నవాజ్ ఫుల్‌టాస్ వేయగా కోహ్లీ సిక్సర్ బాదేశాడు. అది నోబాల్ కావడంతో.. 3 బంతుల్లో 6 పరుగులే చేయాల్సి వచ్చింది. అదనంగా ఫ్రీహిట్ కూడా దొరికింది. నాలుగో బంతికి వైడ్. నాలుగో బంతికి కోహ్లీ బౌల్డయినా.. ఫ్రీహిట్ కావడంతో కోహ్లీ, డీకే మూడు పరుగులు తీశారు.
భారత్ విజయ సమీకరణం 2 బంతుల్లో 2 పరుగులుగా మారింది. ఐదో బంతికి దినేష్ కార్తీక్ స్టంపౌట్ అయ్యాడు. ఆరో బంతికి ఆర్ అశ్విన్ స్ట్రైకింగ్‌కు రాగా.. వైడ్ బాల్ పడింది. దాంతో భారత్ విజయానికి చివరి బంతికి ఒక్క పరుగు అవసరం అయింది. చివరి బంతికి అశ్విన్ సింగిల్ తీయడంతో మ్యాచ్ భారత్ సొంతమైంది. మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మాజీలు, అభిమానులు మైదానంలో సందడి చేశారు. ఈ మ్యాచుపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి. 'మొహ్మద్ నవాజ్ నువ్వే మా హీరో.. నిన్ను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా', 'ప్రియమైన పాకిస్థాన్ ఓటమిని ఆర్డర్ చేయండి.. విరాట్ మీకు ఇచ్చేస్తాడు' అంటూ సెటైర్లు పేలుతున్నాయి.
Also Read: Rohit - Kohli: హ్యాట్సాఫ్ విరాట్ కోహ్లీ.. భారత అత్యుత్తమ నాక్‌లలో ఇది ఒకటి: రోహిత్ శర్మ
Also Read: Virat Kohli, Anushka Sharma: మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఏం చేశాడో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి