IND Vs PAK: ప్చ్.. బ్యాడ్‌న్యూస్.. భారత్-పాక్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..!
India Vs Pakistan Asia Cup 2023 Weather Prediction: పాకిస్థాన్‌తో టీమిండియా మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. దయాదుల మధ్య పోరును వీక్షించేందుకు ఇప్పటికే టికెట్లు మొత్తం బుక్ చేసుకున్నారు. అయితే వర్షం ముప్పు పొంచి ఉండడంతో నిరాశకు గురవుతున్నారు.
India Vs Pakistan Asia Cup 2023 Weather Prediction: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్. భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో వరుణుడు ముప్పు భయపెడుతోంది. శనివారం క్యాండీలోని పల్లెకెలె స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరగనుంది. శ్రీలంక దక్షిణ భాగంలో రాబోయే కొద్ది రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ)కి అధికారులు తెలియజేశారు. క్యాండీ స్థానంలో దంబుల్లా ప్రత్యామ్నాయ వేదికగా సూచించారు. దీంతో మ్యాచ్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. భారత్, పాకిస్థాన్ సమయంలో వర్షం పడే అవకాశం ప్రస్తుతం 70 శాతంగా ఉంది. మ్యాచ్ టాస్ సమయానికి అరగంట ముందు వర్షం వచ్చే అవకాశం ఉంది.
శనివారం సాయంత్రం 5.30 గంటలకు 60 శాతానికి తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శ్రీలంక వాతావరణ శాఖ కూడా రాబోయే కొద్ది రోజుల్లో దేశంలోని పలు ప్రావిన్సుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కాండీ సెంట్రల్ ప్రావిన్స్ పరిధిలోకి వస్తుంది. శుక్రవారం, శనివారం వర్షం పడుతుందని అంటున్నారు. పశ్చిమ, సబరగామువా, మధ్య, వాయువ్య ప్రావిన్స్‌లు, గాలె, మాతర జిల్లాల్లో కొన్నిసార్లు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
పాక్‌తో టీమిండియా పోరు కోసం రెండు దేశాల అభిమానులే కాదు.. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు మొత్తం అమ్ముడయ్యాయి. ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఫ్యాన్స్ డిస్పాయింట్ అవుతున్నారు. ప్రపంచకప్‌కు సన్నాహ వన్డే ఫార్మాట్‌లో జరుగుతోంది. నేపాల్‌పై భారీ విజయంతో పాకిస్థాన్ ఆసియా కప్ టోర్నీని ఆరంభించింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో 238 పరుగుల తేడాతో చిత్తు చేసింది. భారత్‌తో శనివారం జరిగే మ్యాచ్ రద్దయితే.. పాక్ జట్టు సూపర్ 4లో ఎంట్రీ ఇస్తుంది.
భారత్-పాకిస్థాన్ జట్లు ఇప్పటివరకు 132 వన్డేల్లో తలపడ్డాయి. ఇందులో టీమిండియా 55 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్ 73 మ్యాచ్‌లలో విజయం సాధించింది. మరో 4 మ్యాచ్‌ల్లో ఎలాంటి ఫలితం రాలేదు. ఆసియా కప్‌లో ఆడేందుకు టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే కొలంబో చేరుకున్నారు. పాకిస్థాన్‌తో మ్యాచ్ రోజు వర్షం కురవద్దంటూ ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read: Raksha Bandhan Wishes 2023: రాఖీ శుభాకాంక్షలు ఇలా ప్రత్యేక ఫోటోస్, కోట్స్‌తో తెలియజేయండి..
Also Read: Aditya-L1 Mission Rehearsals: ఆదిత్య L1 ప్రయోగం రాకెట్ చెకింగ్, రిహార్సల్స్ పూర్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook