World Cup 2023: అభిమానులకు గుడ్‌న్యూస్.. వరల్డ్ కప్ కోసం పాక్ బోర్డు కీలక నిర్ణయం
IND Vs PAK World Cup 2023: ప్రపంచ కప్ ఆడేందుకు పాక్ జట్టు భారత్‌కు వస్తుందా..? రాదా..? అనే విషయం సందిగ్ధం నెలకొన్న నేపథ్యంలో పీసీబీ గుడ్‌న్యూస్ చెప్పింది. భారత్‌తో ఆడేందుకు అనుమతి కోసం పాక్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం అనుమతి వస్తే.. పాక్ జట్టు భారత్‌లో అడుగుపెడుతుంది.
IND Vs PAK World Cup 2023: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచ కప్ 2023 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. 46 రోజుల పాటు జరిగే విశ్వకప్‌లో ఫైనల్ మ్యాచ్‌తో సహా మొత్తం 48 మ్యాచ్‌లను 12 వేదికలలో నిర్వహించనున్నారు. హైదరాబాద్, అహ్మదాబాద్, ధర్మశాల, ఢిల్లీ, చెన్నై, లక్నో, పూణే, బెంగళూరు, ముంబై, కోల్‌కతా నగరాలు వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. సెప్టెంబర్ 29వ నుంచి ప్రాక్టీస్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ప్రస్తుతం ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
ఇక ఈ మెగా టోర్నీకి దయాది పాకిస్థాన్ క్రికెట్ జట్టు వస్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచకప్ కోసం భారత్‌కు వెళ్లేందుకు అధికారిక అనుమతి కోరుతూ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఇంటర్నల్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది పీసీబీ. పాక్ జట్టును భారత్‌కు వెళ్లేందుకు అనుమతించాలా..? వద్దా..? జట్టు మ్యాచ్‌ల కోసం ఎంపిక చేసిన ఐదు స్టేడియాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా..? అనే వాటిపై సలహా ఇవ్వాలని లేఖలో కోరింది. పాక్ జట్టు ఇండియాకు వస్తుందా లేదా అన్నది పాక్ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చిన తరువాతనే తేలనుంది. ప్రభుత్వం స్పందించడానికి టైమ్ లిమిట్ లేకపోవడంతో.. అప్పటివరకు పీసీబీ ఎదురుచూడాల్సిందే.
వరల్డ్ కప్ షెడ్యూల్ రిలీజ్ అయిన తరువాత వెంటనే పీసీబీ స్పందించింది. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే.. భారత్‌కు తమ జట్టును పంపిస్తామని స్పష్టం చేసింది. ఇది భద్రతకు సంబంధించిన సున్నితమైన అంశమని.. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చిన తర్వాతనే తమ నిర్ణయం ఉంటుందని పీసీబీ అధికారి తెలిపారు. భారత్‌కు వెళ్లడానికి ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాల్సిందేనని ఐసీసీ తెలిపామని వెల్లడించారు.
భారత్, పాకిస్థాన్‌ల జట్ల మధ్య మ్యాచ్ మధ్య జరిగే మ్యాచ్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మ్యాచ్ అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగుతుంది. పాక్ జట్టు చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌లో ఆడింది. రెండు దేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో పాక్ జట్టుకు భారత్‌లో అనుమతి లేదు. టీమిండియా కూడా పాకిస్థాన్‌కు వెళ్లి మ్యాచ్‌లు ఆడదు. ఐసీసీ టోర్నీలు మినహా.. రెండు జట్ల మధ్య దైపాక్షిక సిరీస్‌లు జరగవు. పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో కూడా ప్రవేశం లేదు.
Also Read: West Indies Team: పసికూనల చేతిలో పరాజయం.. వరల్డ్ కప్ రేసు నుంచి విండీస్ ఔట్
Also Read: Karnataka Snake Video: చనిపోయాడని అంత్యక్రియలకు ఏర్పాట్లు.. ఒక్కసారిగా లేచిన వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి