IND vs SA 1st ODI Toss: సౌతాఫ్రికాతో ఇటీవలే జరిగిన టెస్టు సిరీస్ ను 1-2 తేడాతో ఓడిపోయిన టీమ్ఇండియా.. ఇప్పుడు పరిమిత ఓవర్ల కోసం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో నేటి (జనవరి 19) నుంచి ప్రారంభం కానున్న తొలి వన్డేలో ఇండియా, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పార్ల్ వేదికగా జరగనున్న మొదటి మ్యాచులో భారత కెప్టెన్ గా కేఎల్ రాహుల్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ మ్యాచులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు కెప్టెన్ గా కొనసాగిన విరాట్ కోహ్లీ.. ఇప్పుడు బ్యాటర్ గా కొనసాగుతున్నాడు.


టీమ్​ఇండియా వన్డే సారథి రోహిత్​ గాయం కారణంగా ఈ సిరీస్​కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో భారత జట్టు కెప్టెన్​ బాధ్యతలు చేపట్టాడు కేఎల్ రాహుల్. సఫారీల జట్టును తెంబా బవుమా నడిపించనున్నాడు. ఈ మ్యాచ్ తో యువ క్రికెటర్ వెంకటేష్ అయ్యర్ వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 



తుదిజట్లు:


టీమ్ఇండియా: కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, యుజ్వేంద్ర చాహల్. 


సౌతాఫ్రికా: క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), మలన్, మార్​క్రమ్, వాన్ డర్​ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, పెహ్లూక్వయో, జాన్సన్, కేశవ్ మహారాజ్, షంసి, లుంగి ఎంగిడి.


విరాట్ కోహ్లీ టీమ్ఇండియా కెప్టెన్ గా అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలగిన నేపథ్యంలో అతడి బ్యాటింగ్ పై అందరి దృష్టి మళ్లింది. వచ్చే ఏడాది వన్డే ప్రపంచ కప్‌ జరగనున్న నేపథ్యంలో అందుకు ఈ సిరీస్‌ను సన్నాహకంగా భారత జట్టు యాజమాన్యం భావిస్తోంది.


Also Read: IND vs SA 1st ODI Preview: నేటి నుంచి సౌతాఫ్రికాతో వన్డే సిరీస్.. ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైన టీమ్ఇండియా


Also Read: Rohit Sharma Captaincy: కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ- వెండీస్ సిరీస్ కు సిద్ధమైన రోహిత్ శర్మ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook