IND vs SA 1st T20, Arshdeep Singh impresses Rahul Dravid with yorkers: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20ల సిరీస్ త్వరలో ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఇరు జట్లు జూన్ 9 నుంచి 19 వరకు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడనున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జూన్ 9న తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం జూన్ 4 నుంచే దక్షిణాఫ్రికా జట్టు ప్రాక్టీస్ మొదలెట్టింది. భారత జట్టు మాత్రం సోమవారం నెట్‌ ప్రాక్టీస్‌లో పాల్గొంది. హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, బౌలింగ్‌ కోచ్‌ పారస్‌ మాంబ్రే పర్యవేక్షణలో ప్లేయర్స్ శిక్షణ కొనసాగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్‌ 2022లో అదరగొట్టిన యువ పేసర్లు ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్ సింగ్.. టీ20 సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. తొలి టీ20కు ముందు టీమిండియా హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ సోమవారం తొలి ప్రాక్టీస్‌ సెషన్‌ను నిర్వహించాడు. ఈ సందర్భంగా ఉమ్రాన్‌, అర్ష్‌దీప్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆకట్టుకోవడానికి ఒకరితో మరొకరు పోటీపడి మరీ బౌలింగ్ చేశారు. అయితే అద్బుతమైన యార్కర్లతో అర్ష్‌దీప్ అదరగొట్టాడు.


ఉమ్రాన్‌ మాలిక్ తన పేస్ బౌలింగ్‌లో నెట్స్‌లో చమటోడ్చాడు. అయితే రిషబ్ పంత్‌కు ఉమ్రాన్‌ బౌలింగ్‌ చేయగా.. ఒక్క బంతిని కూడా వదలకుండా బాదాడు. ఉమ్రాన్‌ ఎ‍క్కువ పేస్‌తో బౌలింగ్‌ చేయడంతో పంత్‌ సులభంగా షాట్లు ఆడాడు. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో మాత్రం పంత్ షాట్లు ఆడలేకపోయాడు. అర్ష్‌దీప్ యార్కర్లకు హెడ్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ ఫిదా అయ్యాడట. దాంతో తొలి టీ20లో అర్ష్‌దీప్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉమ్రాన్‌ కంటే ముందే అర్ష్‌దీప్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.


ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ సహా భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌ కూడా బౌలింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అదే విధంగా జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన దినేష్‌ కార్తీక్‌ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. భారత జట్టు నెట్‌ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ సిరీస్‌లో బౌలింగ్‌ దళానికి భువనేశ్వర్‌ నేతృత్వం వహించనుండగా..  హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, అర్ష్‌దీప్  సింగ్‌ తుది జట్టులో చోటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.


Also Read: Root - Sachin: సచిన్‌ అత్యధిక పరుగుల రికార్డు పెద్ద కష్టమేమీ కాదు.. జో రూట్‌ సాధిస్తాడు: టేలర్   


Also Read: Amazon Smart TV Offers: అమెజాన్‌లో ఒక్కరోజే ఈ ఛాన్స్.. రూ.20వేలు విలువ చేసే టీవీ కేవలం రూ.5739కే..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook