IND vs SA Dream11 Prediction: బరిలోకి రహానే.. తెలుగు ఆటగాడికి నిరాశే! దక్షిణాఫ్రికాతో బరిలోకి దిగే భారత జట్టిదే!!
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మొదటి టెస్టు సెంచూరియన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. భారత్ అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి టెస్ట్ కోసం బరిలోకి దిగే తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
IND vs SA 1st Test Dream11 Prediction: ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి, ఇంగ్లండ్‌లోనూ పైచేయి సాధించిన భారత జట్టు నేడు మరో కీలక సమరానికి సిద్ధమైంది. ప్రొటీస్ గడ్డపై ఇప్పటివరకు ఒక్క టెస్ట్ సిరీస్ గెలవని దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తలపడనుంది. భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మొదటి టెస్టు సెంచూరియన్‌లో ఆదివారం మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. రెండు జట్లకూ బలమైన బౌలింగ్, బ్యాటింగ్ దళాలు ఉన్న నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే సఫారీ గడ్డపై తొలి సిరీస్ కోసం ఆరాటపడుతున్న టీమిండియాకు తుది జట్టు కూర్పే పెద్ద సమస్యగా మారింది. భారత్ (Team INdia) అయిదుగురు బౌలర్లు, అయిదుగురు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్‌తో బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. తొలి టెస్ట్ కోసం బరిలోకి దిగే తుది జట్టును ఓసారి పరిశీలిద్దాం.
స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో లేకపోవడంతో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul)తో కలిసి మయాంక్ అగర్వాల్ ఇన్నింగ్స్‌ను ఆరంబించనున్నాడు. మూడో స్థానంలో టెస్ట్ స్పెషలిస్ట్ చేతేశ్వర్ పుజారా, నాలుగు స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బరిలోకి దిగనున్నారు. ఇక ఐదవ స్థానం కోసం ముగ్గురు పోటీలో ఉన్నారు. ఇటీవల ఫామ్ లేమితో సతమతమవుతున్న అజింక్య రహానే (Ajinkya Rahane), న్యూజీలాండ్ సిరీసులో సెంచరీ చేసిన శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer), గాయం నుంచి కోలుకున్న తెలుగు బ్యాటర్ హనుమ విహారి (Hanuma Vihari) ఐదో స్థానం కోసం పోటీపడుత్నారు. అయితే విదేశాల్లో మంచి రికార్డు ఉన్న రహానేకే అవకాశం దక్కనుందని కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలను బట్టి చూస్తే అర్ధమవుతోంది. దాంతో అయ్యర్, విహారిలకు నిరాశ తప్పేలా లేదు.
వికెట్ కీపర్ స్థానంలో యువ ప్లేయర్ రిషబ్ పంత్ ఆడడం ఖాయం. ఇక భారత్ ఒక స్పెసలిస్ట్ స్పిన్నర్, నలుగురు పేసర్లతో బరిలోకి దిగనుంది. దక్షిణాఫ్రికాలో బౌన్సీ పిచులు ఉంటాయి కాబట్టి నలుగురు పేసర్లు తప్పనిసరి. స్పిన్నర్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్.. పేసర్ల కోటాలో శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆడనున్నారు. శార్దూల్, అశ్విన్ బ్యాటింగ్ కూడా చేయడం కలిసొచ్చే అంశం. అవసరం అయితే బుమ్రా, షమీ కూడా బ్యాట్ జుళిపిస్తారు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ (Ishant Sharma)కు జట్టులో చోటు దక్కకపోవచ్చు. ఒకేవేళ ఇషాంత్‌కు చోటివ్వాలని విరాట్ కోహ్లీ భావిస్తే.. సిరాజ్ (Siraj) బెంచ్‌కే పరిమితం అయితాడు.
భారత్ తుది జట్టు (అంచనా):
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
డ్రీమ్ 11 టీమ్ (Dream11 Prediction):
మయాంక్ అగర్వాల్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, డీన్ ఎల్గర్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, రిషబ్ పంత్ (కీపర్), వియాన్ ముల్డర్, మహ్మద్ షమీ, కగిసో రబాడ, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి