IND vs SA 1st Test: టీమిండియాదే బ్యాటింగ్.. రహానేకు చోటు! హైదరాబాద్ ప్లేయర్‌కు తప్పని నిరాశ!!
మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
India have won the toss and have opted to bat: మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA 1st Test) జట్ల మధ్య మరికొద్దిసేపట్లో తొలి టెస్టు ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ (Toss) గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వరుసగా విఫలమవుతున్న అజింక్య రహానే ( Ajinkya Rahane)పై కోహ్లీ నమ్మకం ఉంచాడు. దాంతో ఐదవ స్థానం ఆశించిన హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారి (Hanuma Vihari), యువ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)కు నిరాశే ఎదురైంది. ఈ మ్యాచ్ కోసం భారత్ ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతోంది. మరోవైపు దక్షిణాఫ్రికా తరపున మార్కో జాన్‌సెన్ ఆరంగేట్రం చేస్తున్నాడు. భారత్-ఏపై మార్కో అద్భుతంగా రాణించాడు.
సొంతగడ్డపై దక్షిణాఫ్రికా బలమైన జట్టు. అయితే ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించి,ఇంగ్లండ్‌లోనూ పైచేయి సాధించిన విశ్వాసంతో భారత్ బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది. సొంతగడ్డపై దక్షిణాఫ్రికా ఆధిపత్యం కొనసాగుతుందా? లేదా సఫారీ గడ్డపై తొలి సిరీస్ నిరీక్షణకు భారత్ తెరదించుతుందా? అన్నది చూడాలి. దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్ట్ సిరీస్ కూడా భారత్ గెలవని విషయం తెలిసిందే. 2014 నుంచి దక్షిణాఫ్రికా సెంచూరియన్‌లో ఓడిపోలేదు. ఈ నేపథ్యంలో కోహ్లీసేన గెలవాలంటే శక్తికి మించి పోరాడాల్సి ఉంటుంది.
సెంచూరియన్ పిచ్‌పై ప్రస్తుతం పచ్చిక ఉంది. ఈ పిచ్ పేస్ బౌలర్లకు పూర్తిగా అనుకూలించనుంది. తొలి రెండు రోజుల్లో వర్షం వల్ల ఆటకు అంతరాయాలు కలగొచ్చు. మూడు నుంచి అయిదో రోజు వరకు వాతావరణం బాగుంటుంది. సెంచూరియన్‌లో ఎండ కాస్తుంది. ఈ పిచ్‌పై భారత్ రెండు టెస్టులు ఆడింది. 2010లో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైన భారత్.. 2018లో 135 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. సఫారీ గడ్డపై భారత్ 7 టెస్టు సిరీస్‌లు ఆడింది. 2010-11లో 1-1తో సిరీసును డ్రా చేసుకోగా.. మిగతా ఆరు సిరీస్‌లనూ దక్షిణాఫ్రికానే గెలిచింది.
Also Read: Anushka and Naveen Polishetty: అనుష్కతో ఖరారైన నవీన్ పోలిశెట్టి అప్‌కమింగ్ మూవీ, కధ ఏంటో తెలుసా
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చేతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానే, రిషబ్ పంత్ (కీపర్), రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
దక్షిణాఫ్రికా: డీన్ ఎల్గర్ (కెప్టెన్), ఎయిడెన్ మార్కరమ్, కీగన్ పీటర్సన్, రసే వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), వియాన్ మల్దర్, మార్కో జాన్‌సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, లుంగి ఎంగిడి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి