Team India players receives grand Welcome with beautiful ladies at Thiruvananthapuram: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న టీమిండియా మరో కీలక సమరానికి సిద్దమైంది. స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో టీ20, వన్డే సిరీస్‌లను భారత్ ఆడనుంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బుధవారం (సెప్టెంబరు 28) నుంచి టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో రేపు రాత్రి 7 గంటలకు తొలి టీ20 ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం సోమవారం మధ్యాహ్నం భారత ఆటగాళ్లు హైదరాబాద్ నుంచి నేరుగా కేరళ వెళ్లారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తిరువనంతపురంలో అడుగుపెట్టిన భారత జట్టుకు ఘన స్వాగతం లభించింది. టీమిండియా బస చేసే హోటల్‌ వద్ద టీమిండియా ఆటగాళ్లకు స్వాగతం పలికేందుకు కేరళ క్రికెట్ బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. బస్సు దిగి హోటల్‌కు వెళ్లే దారిలో ఆటగాళ్లపై అందమైన అమ్మాయిలతో పూలు చల్లించింది. రెండు వైపులా అమ్మాయిలు నిలబడి ఆటగాళ్లపై పూలు చల్లారు. దాంతో కెప్టెన్ రోహిత్ శర్మ, స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ నవ్వులు పూయిస్తూ హోటల్‌ లోపలి వెళ్లారు. పూలు మాత్రమే కాదు ప్లేయర్ల మెడలో మెడల్స్ కూడా అమ్మాయిలతోనే వేయించింది కేరళ క్రికెట్ బోర్డు. 


[[{"fid":"246522","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


ఇక టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇద్దరు అమ్మాయిలు బొట్టుపెట్టి మరీ మెడల్ వేశారు. భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా  బొట్టుపెట్టి మెడల్ వేశారు. టీమిండియా ఆటగాళ్లపై అమ్మాయిలు పూలు చల్లడం, మెడల్స్ వేయడంకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు లైకుల, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 'కేరళ సంప్రదాయం అది' అని ఒకరు కామెంట్ చేయగా.. 'కేరళనా మజాకా' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


[[{"fid":"246523","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]


Also Read: దీప్తి శర్మ అబద్దాలాడుతోంది.. రనౌట్‌ వివాదంపై స్పందించిన ఇంగ్లండ్ కెప్టెన్‌!


Also Read: భారత మహిళా క్రికెట‌ర్‌ తానియా భాటియాకు చేదు అనుభవం.. అగంతకుడు రూమ్‌లోకి దూరి..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook