IND vs SA 2nd T20 Weather Forecast: అభిమానులకు బ్యాడ్ న్యూస్.. రెండో టీ20 మ్యాచ్ కష్టమే!
India vs South Africa 2nd T20I at Guwahati Weather Forecast. అభిమానులకు బ్యాడ్ న్యూస్. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు వర్షపు ముప్పు పొంచి ఉందని గువహటి వాతావరణ పేర్కొంది.
Rain threat to India vs South Africa 2nd T20I at Guwahati: తొలి టీ20లో దక్షిణాఫ్రికాను ఓడించి మూడు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌ను భారత్ అద్భుతంగా ఆరంభించింది. ఇక గువహటిలోని బర్సాపరా స్టేడియంలో నేటి రాత్రి 7 గంటలకు రెండో టీ20లో దక్షిణాఫ్రికాను భారత్ ఢీకొట్టనుంది. టీ20 ప్రపంచకప్ 2022 సన్నాహకాల్లో భాగంగా జరుగుతున్న ఈ సిరీస్‌ను గువహటిలోనే కైవసం చేసుకోవాలని రోహిత్ సేన చూస్తోంది. మరోవైపు ఈ మ్యాచులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని ప్రొటీస్ భావిస్తోంది. దాంతో నేటి పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.
ఆదివారం రాత్రి 7 గంటలకు భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు వర్షపు ముప్పు పొంచి ఉంది. గువహటిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ పేర్కొంది. దాదాపుగా మూడు గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడనుందట. దాంతో మ్యాచ్ సజావుగా సాగడం కష్టంగానే మారింది. కుదించిన ఓవర్లతో మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
రెండో టీ20 మ్యాచ్ వీక్షించేందుకు టికెట్లు కొన్న అభిమానులు ఈ వార్తతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వర్షం పడకూడదని ఫాన్స్ కోరుకుంటున్నారు. కరోనా మహమ్మారి పరిస్థితుల తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో.. గువహటిలో భారీ సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. అమ్మకానికి పెట్టిన కొద్ది నిమిషాల్లోనే టికెట్స్ అన్ని హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్టేడియం అధికారులు తెలిపారు.
Also Read: ఆయన నేను ఎందుకూ పనికిరాననుకున్నారు.. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా: అల్లు అర్జున్
Also Read: IND vs SA: సిరాజ్ ఇన్.. పంత్ డౌట్! దక్షిణాఫ్రికాతో తలపడే భారత తుది జట్టు ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి