IND vs SA 3rd ODI: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్.. భువీ, వెంకీ ఔట్! నాలుగు మార్పులతో బరిలోకి టీమిండియా!
IND vs SA 3rd ODI Toss: మూడో వన్డే మ్యాచులో టాస్ గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
IND vs SA 3rd ODI Toss: కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA 3rd ODI) జట్ల మధ్య మరికొద్దిసేపట్లో చివరిదైన మూడో వన్డే మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ (Toss) గెలిచిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచులో భారత్ నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. వరుసగా విఫలమయిన వెంకటేష్ అయ్యర్, భువనేశ్వర్ కుమార్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్ స్థానాల్లో సూర్యకుమార్ యాదవ్, ప్రసిద్ కృష్ణ, జయంత్ యాదవ్, దీపక్ చహర్‌లు జట్టులోకి వచ్చారు. మరోఆవైపు దక్షిణాఫ్రికా మాత్రం ఒక మార్పు చేసింది.
టెస్టు సిరీస్‌లో పరాజయం అనంతరం వన్డేల్లోనూ వరుసగా రెండు ఓటములతో ఇప్పటికే సిరీస్ కోల్పోయిన టీమిండియా.. ఈరోజు జరిగే నామమాత్రమైన చివరి వన్డేలో సఫారీ జట్టు ఢీ కొడుతోంది. సిరీస్ పోయినా మూడో వన్డే మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్ తప్పించుకోవడమే కాకుండా పరువు దక్కించుకోవాలని భారత్ చూస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగుతోంది. చూడాలి మరి రాహుల్ కెప్టెన్సీ ఎలా ఉంటుందో.
తుది జట్లు:
భారత్: కెఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, జయంత్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా, యుజ్వేంద్ర చహల్.
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, రసీ వాన్ డెర్ డసెన్, తెంబా బవుమా(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ఆండిలే ఫెహ్లూక్వాయో, సిసిందా మగాలా, కేశవ్ మహరాజ్, డ్వైన్ ప్రిటోరియస్, లుంగి ఎంగిడి.