Sunil Gavaskar slams Virat Kohli's Tactics In Post-Lunch Session On Day 4: కేప్‌టౌన్ వేదికగా దక్షిణాఫ్రికాతో శుక్రవారం ముగిసిన మూడో టెస్టు (IND vs SA 3rd Test)లో టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli') అనుసరించిన వ్యూహాలపై భారత మాజీ క్రికెటర్‌, స్టార్ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగో రోజైన శుక్రవారం ఆటలో భాగంగా లంచ్ బ్రేక్‌ తర్వాత కోహ్లీ అమలు చేసిన వ్యూహాలు అంతుపట్టలేదని, అందులో చాలా లోపాలున్నాయన్నారు. కేప్‌టౌన్ టెస్టులో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించింది. దాంతో 2-1 తేడాతో ఎల్గర్ సేన సిరీస్‌ను సొంతం చేసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాలుగో రోజు లంచ్ బ్రేక్‌ సమయానికి దక్షిణాఫ్రికా మూడు వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అప్పటికీ దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే.. ఇంకా 41 పరుగులు చేయాల్సి ఉంది. లంచ్ బ్రేక్‌ తర్వాత ఉమేశ్‌ యాదవ్, రవిచంద్రన్‌ అశ్విన్‌లతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలింగ్ చేయించడంతో ప్రొటీస్ 8.1 ఓవర్లలోనే మిగతా రన్స్ చేసి విజయం సాధించింది. అప్పటికే మంచి లయతో బౌలింగ్‌ చేస్తున్న జస్ప్రీత్ బుమ్రా, శార్దూల్‌ ఠాకూర్‌లను కాదని ఉమేశ్‌, అశ్విన్‌లతో బౌలింగ్‌ చేయించడాన్ని భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ తప్పుపట్టారు. 


Also Read: Virat Kohli: అందుకే ఓడిపోయాం.. ఇక వారికి గ్యారంటీ ఇవ్వలేం! 30-45 నిమిషాల్లోనే మ్యాచులను కోల్పోతున్నాం: కోహ్లీ


'నాలుగో రోజు భోజన విరామం తర్వాత శార్దూల్ ఠాకూర్‌, జస్ప్రీత్ బుమ్రాలతో విరాట్ కోహ్లీ ఎందుకు బౌలింగ్‌ చేయించలేదో ఇప్పటికీ అంతుపట్టడం లేదు. బహుశా భారత్ కచ్చితంగా ఓడిపోతామని ముందే నిర్ణయించుకుని ఉంటుంది. స్పిన్నర్‌ ఆర్ అశ్విన్‌ బౌలింగ్‌ చేస్తుంటే.. ఫీల్డర్లను కూడా సరైన ప్రాంతాల్లో మోహరించలేదు. ప్రత్యర్థి ఆటగాళ్లను ఔట్ చేసేందుకు అదొక్కటే మార్గమన్నట్లు డీప్‌ వికెట్‌లోనే ఐదుగురు ఫీల్డర్లను ఉంచారు. అలా చేయడం వల్ల బ్యాటర్లకు సులభంగా సింగిల్స్‌ తీసేందుకు అవకాశం దొరికింది' అని సన్నీ పేర్కొన్నారు. 


'చివరి రెండు టెస్టులు జరిగిన జొహాన్నెస్ బర్గ్‌, కేప్‌టౌన్‌లోని పిచ్‌లు సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలించవు. అయినా దక్షిణాఫ్రికా ఆటగాళ్లు గొప్ప పోరాట పటిమతో రాణించారు. గెలవాలనే దృఢ సంకల్పంతో వారు రాణించిన తీరు ప్రశంసనీయం. డీన్ ఎల్గర్, కీగన్ పీటర్సన్, తెంబా బావుమా లాంటి ప్లేయర్స్ బాగా ఆడారు. ఇక కాగిసో రబాడ, మార్కో జాన్సన్‌ అద్భుత బంతులు వేశారు' అని కామెంటేటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసించారు. సన్నీ భారత్ తరపున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడారు. గవాస్కర్ టెస్టుల్లో తనదైన ముద్ర వేసిన విషయం తెలిసిందే. 


Also Read: RRB NTPC Result: ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ-1 2019 ఫలితాలు విడుదల... అభ్యర్థులు ఇలా చెక్ చేసుకోండి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook