IND vs SA Dream11 Team Prediction for ICC T20 World Cup 2022: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భారత్ నేడు కీలక మ్యాచ్ ఆడబోతోంది. పాకిస్తాన్, నెదర్లాండ్స్ జట్లను ఓడించిన రోహిత్ సేన.. నేటి సాయంత్రం దక్షిణాఫ్రికాను ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్‌ను కూడా టీమిండియా గెలిస్తే.. సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా ఖాయమైనట్టే. ఈ నేపథ్యంలో రోహిత్ సేన విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. మరోవైపు ఓ మ్యాచ్ గెలిచి. మరో మ్యాచ్ టై కావడంతో ఈ మ్యాచ్ దక్షిణాఫ్రికాకు కూడా చాలా కీలకం. మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ పెర్త్ స్టేడియంలో జరగనుంది. సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్ ఆరంభం అవుతుంది. పెర్త్‌ ఫ్లాట్ పిచ్. బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.  అయితే మ్యాచ్ సాగుతున్న కొద్దీ బౌలర్లకు సహకరిస్తుంది. తొలి ఇన్నింగ్ యావరేజ్ 143 రన్స్. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకే ఇక్కడ విజయావకాశాలు అధికం. ఈ మైదానంలో 60 సార్లు ఛేజింగ్ జట్టు విజయాన్ని అందుకుంది. అందుకే టాస్ గెలిచిన జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు.


తుది జట్టు: 
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్/రిషబ్ పంత్, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్. 
దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డికాక్, రిలీ రొస్సొ, ఎయిడెన్ మార్క్‌రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, వేన్ పార్నెల్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, ఎన్రిచ్ నోర్జ్, తబ్రేజ్ షమ్సీ. 


డ్రీమ్ 11 టీమ్:
క్వింటన్ డికాక్ (వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ (రోహిత్ శర్మ), విరాట్ కోహ్లీ, రిలీ రొస్స, డేవిడ్ మిల్లర్, వేన్ పార్నెల్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ, కగిసో రబడ, అన్రిచ్ నార్జ్.


Also Read: Rakul Preet Singh Bikini Photos: బీచ్ ఒడ్డున రెచ్చిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్.. అందాలు ఆరబోయడంలో హద్దులు దాటేసిందిగా!


Also Read: Brahmaji Counter:అనసూయ ‘ఆంటీ’ని వదలని బ్రహ్మాజీ.. ప్రభాస్ ను కూడా వాడేసుకున్నాడుగా!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook