Surya Kumar Yadav Catch Video: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య పోరులో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. సౌతాఫ్రికా విజయానికి ఆరు బంతుల్లో 16 పరుగులు కావాలి. క్రీజ్‌లో ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చేత్తో గెలిచిపించిన డేవిడ్ మిల్లర్ ఉన్నాడు. కోట్లాది అభిమానుల ఆశల మోస్తూ హార్థిక్ పాండ్యా బంతి అందుకున్నాడు. తొలి బంతిని ఫుల్ టాస్ వేయగా.. మిల్లర్ స్ట్రైట్‌గా బలంగా బాదాడు. బంతి బౌండరీ లైన్‌ వైపు దూసుకువెళ్లడంతో అందరూ సిక్సర్ ఖాయమనుకున్నారు. కానీ బౌండరీ లైన్‌ వద్ద కొదమ సింహాంలా సూర్యకుమార్ యాదవ్ దూసుకవచ్చాడు. బంతికి కళ్లు చెదిరే రీతిలో చేతిలోకి అందుకున్నాడు. బ్యాలెన్స్ చేసుకుని బంతికి గాల్లోకి ఎగరేసి.. బౌండరీ లైన్ దాటి మళ్లీ లోపలికి వచ్చి క్యాచ్ పట్టేశాడు. ఇక అంతే టీమిండియా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటాయి. సూర్యకుమార్ యాదవ్ అందుకున్నది ఒక క్యాచ్ కాదు.. ఏకంగా వరల్డ్ ట్రీఫీని తన చేతుల్లో పట్టుకుని జట్టుకు అందించినట్లయింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: T20 World Cup Prize Money: జగజ్జేతగా నిలిచిన భారత్‌కు భారీగా ప్రైజ్‌మనీ.. టీ20 వరల్డ్ కప్‌లో ఏ టీమ్‌ ఎంత గెలుచుకుందంటే..?


బార్బడోస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (76), అక్షర్ పటేల్ (47) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయినా డికాక్ (39), స్టబ్స్ (31) రాణించడంతో కోలుకుంది. అయితే క్లాసెన్ (27 బంతుల్లో 52, 2 ఫోర్లు, 5 సిక్సర్లు) ఊచకోత కోయడంతో మ్యాచ్ మొత్తం దక్షిణాఫ్రికా చేతిలోకి వెళ్లిపోయింది. 17 ఓవర్‌లో క్లాసెన్‌ను పాండ్యా ఔట్ చేయడంతో భారత్‌కు మ్యాచ్‌పై ఆశలు చిగురించాయి.


 




ఆ తరువాత ఓవర్‌లో బుమ్రా కేవలం రెండు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. దీంతో రెండు ఓవర్లలో 20 పరుగులు చేయాల్సి ఉంది. 19 ఓవర్‌లో అర్ష్‌దీప్ సింగ్ కేవలం 4 నాలుగు పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ తారాస్థాయికి చేరింది. చివరి ఓవర్‌లో తొలి బంతికే డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుత రీతిలో అందుకోవడంతో భారత్ విజయం ఖాయమైంది. చివరికి దక్షిణాఫ్రికా 168 పరుగులకు పరిమితమైంది. 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్న భారత్.. సగర్వంగా పొట్టి కప్‌ను ముద్దాడింది. 2007 తొలిసారి టీ20 వరల్డ్ కప్‌ను అందుకున్న భారత్.. రెండోసారి సొంతం చేసుకుంది. అంతేకాదు 11 ఏళ్ల తరువాత ఐసీసీ టోర్నీని సొంతం చేసుకుంది. విరాట్ కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ టోర్నీ అవార్డు దక్కింది.


Also Read: 7th Pay Commission: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ గిఫ్ట్.. డీఏ ఏకంగా 16 శాతం పెంపు..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి