India and South Africa Toss Updates and Playing 11: ప్రపంచకప్‌లో టాప్-2 జట్ల మధ్య పోరుకు సమయం ఆసన్నమైంది. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య బిగ్‌ఫైట్‌కు రంగం సిద్ధమైంది. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో భారత్ సెమీస్ చేరుకోగా.. ఏడు మ్యాచ్‌ల్లో ఆరు విజయాలు, ఒక ఓటమితో సౌతాఫ్రికా సెమీస్‌లో బెర్త్ ఫిక్స్ చేసుకుంది. ప్రత్యర్థులను చిత్తు చేసుకుంటూ సెమీస్ చేరిన అగ్రశేణి జట్ల మధ్య యుద్ధం ఆసక్తికరంగా సాగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. దక్షిణాఫ్రికా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

"మేము మొదట బ్యాటింగ్ చేస్తాం. పిచ్‌ మంచిగా కనిపిస్తోంది. బ్యాటింగ్ తీసుకోవడం పిచ్‌తో సంబంధం లేదు. మేము సవాలు చేయాలనుకుంటున్నాం. స్థిరమైన ఆటతీరును కనబర్చి.. పాయింట్ల పట్టికలో రెండు జట్లు అగ్రస్థానానికి చేరుకోవడం ఆనందంగా ఉంటుంది. నాకు ఈ స్టేడియంలో ఆడటం చాలా ఇష్టం. నాకే కాదు, మొత్తం జట్టు ఈ చారిత్రాత్మక మైదానంలో ఆడేందుకు ఎదురుచూస్తోంది. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఆడుతున్నాం. తుది జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం కనిపించలేదు.." అని భారత కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు.


"టాస్ గెలిచి ఉంటే మేము కూడా మొదట బ్యాటింగ్ చేసేవాళ్లం.. కానీ ఇప్పుడు మనం ఛేజింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మంచి సవాలుగా ఉంటుంది. మేము మరింత ఆత్మవిశ్వాసం పొందాల్సిన ప్లేస్ ఇది. మరింత బాధ్యతతో బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. స్థిరమైన ఆటతీరును కనబర్చాల్సిన అవసరం ఉంది. తుది జట్టులో ఒక మార్పు చేశాం. జెరాల్డ్ కోయెట్జీ స్థానంలో షమ్సీను ప్లేయింగ్ 11లో తీసుకున్నాం.." సఫారీ కెప్టెన్ టెంబా బావుమా తెలిపాడు.


తుది జట్లు ఇలా..


భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.


దక్షిణాఫ్రికా: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్‌క్రమ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, తబ్రైజ్ షమ్సీ, కగిసో రబాడ, లుంగి ఎంగిడి.


Also Read: Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు  


Also Read: Redmi 13C Price: అదిరిపోయే ఫీచర్స్‌తో డెడ్‌ చీప్‌ ధరతో మార్కెట్‌లోకి Redmi 13C మొబైల్‌..స్పెసిఫికేషన్స్‌ ఇవే..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook