Virat Kohli likely to miss ODI series vs South Africa: దక్షిణాఫ్రికాతో త్వరలో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా (Team India)కు భారీ షాక్‌ తగలనుంది. గాయం కారణంగా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమైన టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ.. వన్డే సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. రెండో టెస్ట్‌ అఖరి నిమిషంలో వెన్ను నొప్పి కారణంగా కోహ్లీ (Virat Kohli) తప్పుకున్న విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోహ్లీ గైర్హాజరీలో స్టార్ ఓపెనర్ కేఎల్‌ రాహల్‌ కెప్టెన్పీ బాధ్యతలు అందుకున్నాడు. టాస్‌ సమయంలో తాత్కాలిక సారథి రాహుల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుం విరాట్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడని తెలిపాడు.


ప్రస్తుతం విరాట్ కోహ్లీ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. సోమవారం రెండో టెస్ట్ ఆరంభం కాగా.. శుక్రవారం (జనవరి 7) ముగియనుంది. ఇక జనవరి 11న మూడో టెస్ట్ ఆరంభం కానుంది. వెన్ను నొప్పి కారణంగా మూడో టెస్టుకు కూడా విరాట్ అందుబాటులో ఉండదని సమాచారం తెలుస్తోంది. అంతేకాదు వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరం కానున్నాడని ఓ జాతీయ మీడియా తమ కథనంలో పేర్కొంది.


అంతకుముందు వ్యక్తిగత కారణాలతో కోహ్లీ వన్డే సిరీస్‌ నుంచి తప్పకోనున్నాడని వార్తలు వినిపించాయి. కానీ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో మాత్రం అతడు ఉన్నాడు. కాగా మరోసారి వన్డేలకు విరాట్ అందుబాటులో ఉండడంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 


Also Read: IND vs SA: టీమిండియాకు మరో ఎదురుదెబ్బ.. గాయపడిన స్టార్ పేసర్! బరిలోకి దిగడం కష్టమే?


మరోవైపు టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహత్‌ శర్మ (Rohit Sharma) కూడా గాయం బారిన పడిన విషయం తెలిసిందే. టెస్టులకు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా.. హిట్‌మ్యాన్ గాయపడ్డాడు. గాయం కారణంగా రోహిత్ టెస్టులకు దూరమయ్యాడు. టెస్టులతో పాటుగా వన్డే సిరీస్‌కు రోహిత్ అందుబాటులో లేడు.


దాంతో కేఎల్ రాహుల్ (KL Rahul) జట్టును నడిపించనున్నాడు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను వైస్ కెప్టెన్‎గా సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇక భారత్‌, దక్షిణాఫ్రికా (IND vs SA) తొలి వన్డే జనవరి 19న జరగనుంది. 21, 23న రెండు, మూడు వన్డేలు జరగనున్నాయి. 


భారత వన్డే జట్టు: 
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, యుజ్వేంద్ర చహల్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, దీపక్ చహర్, ప్రసిద్ కృష్ణ, శర్దూల్ ఠాకుర్, మొహ్మద్ సిరాజ్.


Also Read: Arvind Kejriwal - Covid 19: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కరోనా.. ఇంట్లోనే ఐసొలేషన్‌!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook