IND vs SA: India 6 wickets away to win Boxing Day Test: మూడు టెస్ట్ మ్యాచుల సిరీస్‌లో భాగంగా సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. విజయంపై ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉన్నాయి. చివరి రోజు ఆటలో ఎవరు పైచేయి సాధిస్తే వారిదే మ్యాచ్. నాలుగో రోజైన బుధవారం ఆట ముగిసేసమయానికి దక్షిణాఫ్రికా (South Africa) రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. దాంతో చివరి రోజు దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 211 రన్స్ చేయాల్సి ఉండగా.. భారత్ (Team India) విజయానికి మరో 6 వికెట్లు అవసరం. అయితే మ్యాచులో చివరి రోజైన గురువారం వర్షం పడే అవకాశాలు ఉండడంతో ఫలితం ఎలా ఉండనుందో మరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బుధవారం ఆట ముగిసే సమయానికి 40.5 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ ఐడెన్ మార్క్రామ్ (1) త్వరగానే పెవిలియన్ చేరాడు. కీగన్ పీటర్సన్ (17) అండతో కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌ (52) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. సిరాజ్ దెబ్బకొట్టాడు. పీటర్సన్ అనంతరం క్రీజులోకి వచ్చిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితం అయ్యాడు. 65 బంతుల్లో 11 పరుగులు చేసిన డస్సెన్‌ను బుమ్రా ఔట్ చేశాడు. మరోవైపు కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌ (Dean Elgar) మాత్రం ఆచితూచి ఆడుతూ అర్ధ శతకం సాధించాడు.


Also Read: Shardul Thakur: థర్డ్ అంపైర్.. నిద్ర పోతున్నావా ఏంది! శార్దూల్ ఠాకూర్ వికెట్‌పై సోషల్ మీడియాలో దుమారం!!




కేశవ్ మహారాజ్ (8)ను కూడా బుమ్రా (Jasprit Bumrah) పెవిలియన్ చేర్చి దక్షిణాఫ్రికా జట్టును మరో దెబ్బకొట్టాడు. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ డీన్‌ ఎల్గర్‌ (52) ఉన్నాడు. భారత బౌలర్లు బుమ్రా 2.. షమీ (Shami), సిరాజ్‌ (Siraj) చెరో వికెట్‌ తీశారు. ఓవర్‌నైట్‌ స్కోరు 16/1తో నాలుగో రోజైన బుధవారం ఉదయం ఆటను ప్రారంభించిన టీమిండియా 174 పరుగులకు ఆలౌటైంది. దాంతో మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకుని కోహ్లీసేన దక్షిణాఫ్రికా ముందు 304 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (34) టాప్ స్కోరర్. ప్రోటీస్ పేసర్లు కాగిసో రబాడ, మార్కో జాన్సెన్ చెరో నాలుగు పడగొట్టారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్ స్కోరు 327 పరుగులు కాగా.. దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్ స్కోరు 197. ఇక ఐదవ రోజు భారత్‌ విజయానికి ఆరు వికెట్లు అవసరం కాగా.. దక్షిణాఫ్రికా విజయం సాధించాలంటే 211 పరుగులు చేయాలి. 


Also Read: Sri Reddy Comments on Samantha: 'ఆమె బట్టలు విప్పినా అక్కడ ఏమి ఉండవు'.. సమంతపై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook