IND vs SA Weather Report: భారత్-దక్షిణాఫ్రికాకు ఒక్కో పాయింట్.. కారణం ఇదే!

Rain might play a spoilsport India vs South Africa T20 World Cup 2022 match. భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. పెర్త్ స్టేడియంలో సాయంత్రం 4:30 గంటలకు ఆరంభం అవుతుంది.
Rain Threat for India vs South Africa at T20 World Cup 2022 match: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2022లో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న భారత్.. నేడు మరో కీలక మ్యాచ్ ఆడనుంది. గ్రూప్ 2లో భాగంగా పాకిస్థాన్, నెదర్లాండ్స్‌పై అద్భుత విజయాలు అందుకున్న టీమిండియా.. ఆదివారం దక్షిణాఫ్రికాతో ఢీ కొట్టనుంది. ఈ మ్యాచ్ పెర్త్ స్టేడియంలో సాయంత్రం 4:30 గంటలకు ఆరంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ను కూడా భారత్ గెలిస్తే.. రోహిత్ సేనకు సెమీ ఫైనల్స్ బెర్త్ దాదాపుగా ఖరారు అవుతుంది.
దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో గెలిచి హ్యాట్రిక్ విజయాలు అందుకోవాలని చూస్తున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌కు వరణుడు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ జరిగే పెర్త్‌లో ప్రస్తుతం ఆకాశం మొత్తం మేఘావృతమై ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. మధ్యాహ్నం, సాయంత్రం వర్షం పడే అవకాశాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. గంటకు 25 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని ప్రకటించింది.
భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్ సాయంత్రం జరుగుతుంది కాబట్టి.. వర్షం పడే అవకాశాలు 50 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి. మ్యాచ్ సమయంలో భారీ వర్షం పడితే.. రద్దయ్యే ఛాన్స్ ఉంది. ఇదే జరిగితే భారత్, దక్షిణాఫ్రికాకు ఒక్కో పాయింట్ దక్కుతుంది. ఓ మ్యాచ్ రద్దు కావడంతో ఇప్పటికే ప్రొటీస్ జట్టు ఖాతాలో ఒక పాయింట్ చేరింది. మెగా టోర్నీలో ఇప్పటికే చాలా మ్యాచులు రద్దైన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు.
గ్రూప్ 2లో ఉన్న భారత్ ఇప్పటికే ఆడిన రెండు మ్యాచుల్లో గెలిచి 4 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నది. దక్షిణాఫ్రికా ఆడిన రెండు మ్యాచుల్లో ఒకటి గెలవగా.. ఇంకోటి టైగా ముగిసింది. 3 పాయింట్స్ ఖాతాలో ఉన్న ప్రొటీస్ జట్టు మూడో స్థానములో ఉంది. ఆడిన మూడు మ్యాచులలో రెండు గెలిచి 4 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. జింబాంబ్వే 2, పాకిస్తాన్ 0, నెదర్లాండ్స్ 0 పాయింట్స్ ఉన్నాయి.
Also Read: Virat Kohli Record: మరో 28 పరుగులే.. ప్రపంచ రికార్డు నెలకొల్పనున్న విరాట్ కోహ్లీ!
Also Read: IND vs SA Dream11 Team: దక్షిణాఫ్రికాతో భారత్ బిగ్ ఫైట్.. డ్రీమ్ 11 టీమ్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook